ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్ > న్యూఢిల్లీలో పెరుగుతున్న అత్యాచారాల సంఖ్య
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
న్యూఢిల్లీలో పెరుగుతున్న అత్యాచారాల సంఖ్య
PNR
Sr Sub-Editor
FileFILE
అది దేశానికి కేంద్రం. ప్రపంచంలో రెండో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా గుర్తింపు పొందిన భారతావనికి రాజధాని. పేరు.. న్యూఢిల్లీ. ఈ ప్రాంతం ఇటీవలి కాలంలో మానభంగాల కేంద్రంగా మారుతోంది. దేశంలో ఉన్న నాలుగు మెట్రో నగరాల్లో ఒకటైన ఢిల్లీలో సగటు మహిళ రక్షణ గాలిలో దీపంలా మారింది. అందుకే ఢిల్లీ 'మానభంగాల రాజధాని'గా అపఖ్యాతి మూటగట్టుకోనుంది.

ఈ విషయాన్ని ఏ స్వచ్ఛంద లేక మీడియా సంస్థలు చెపుతున్న విషయం కాదు. సాక్షాత్ ప్రభుత్వం లెక్కలు చెపుతున్న పచ్చినిజం. ఇక్కడ ప్రతి 1003.1 నిమిషాలకు ఒక మహిళ అత్యాచారానికి గురవుతున్నట్టు ప్రభుత్వ తాజా గణాంకాలు తేల్చాయి. జాతీయ నేర గణాంకాల సంస్థ (నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో) తాజాగా ఒక సర్వే నిర్వహించింది. ఢిల్లీ శివారు ప్రాంతాలను మినహాయించి నమోదైన మానబంగాలను లెక్కించింది. ప్రతి 1003.1 నిమిషాలకు ఒక మానభంగం కేసు నమోదైనట్టుగా నిర్ధారించింది.

ఢిల్లీ తర్వాతి స్థానాన్ని దేశ వాణిజ్య రాజధాని ముంబై ఆక్రమించుకుంది. ఇక్కడ ప్రతి 3020.7 నిమిషాలకు ఒక కేసు నమోదవుతోందని ఎన్.సి.ఆర్.బి. వెల్లడించింది. అయితే.. దేశంలోని మెట్రో నగరాల్లో ఒకటైన కోల్‌కతాలో మహిళలకు అత్యంత సురక్షిత ప్రాంతంగా ఉంది. ఇక్కడ ప్రతి 11,945.5 నిమిషాలకు ఒక మానభంగ కేసు నమోదవుతోంది. కానీ, మహిళలపై లైగింక వేధింపుల్లో తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నై రికార్డుకెక్కింది. ఇక్కడ ప్రతి 11,426 నిమిషాలకు ఒక లైంగిక వేధింపు కేసు
FileFILE
నమోదైంది.


గత ఏడాది నమోదైన కేసులను పరిశీలించగా.. ఢిల్లీలో మొత్తం 524 సంఘటనలు జరుగగా, 483 కేసుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేశారు. ఈ సంఖ్య 2006 సంవత్సరంతో పోల్చి చూడగా తక్కువ కావడం గమనార్హం. 2006లో మొత్తం 695 కేసులు నమోదు కాగా, 533 కేసుల్లో ఛార్జిషీటు దాఖలు చేశారు. అలాగే మిగిలిన మెట్రోపాలిటన్ నగరాలైన చెన్నైలో 46 కేసులు నమోదు కాగా, కోల్‌కతాలో 44 కేసులు, ముంబైలో 174 కేసులు నమోదయ్యారు.

అలాగే ఢిల్లీతో పాటు దాని శివారు ప్రాంతాలను పరిశీలిస్తే 2007 సంవత్సరంలో మొత్తం 598 కేసులు నమోదయ్యాయి. అనగా.. ప్రతి 878.9 నిమిషాలకు ఒక మానభంగ కేసు చొప్పున నమోదైంది. అందుకే దేశ రాజధాని అత్యాచారం (రేప్) రాజధానిగా అపఖ్యాతిని మూటగట్టుకునే ప్రమాదం పొంచివుంది. ఇటీవలి కాలంలో విదేశీ మహిళా పర్యాటకులు అధికంగా అత్యాచారాలకు గురవుతున్న ప్రాంతంగా గుర్తింపు పొందిన పర్యాటక కేంద్రం గోవా ఈ పట్టికలో స్థానం పొందక పోవడం గమనార్హం.

గోవాలో ప్రతి 26,280 నిమిషాలకు ఒక కేసు చొప్పున నమోదు కావడం ఆసక్తికర అంశం. అలాగే అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా నాగాలాండ్ ఎంపికైంది. ఇక్కడ ప్రతి 40,430 నిమిషాలకు ఒక కేసు చొప్పున నమోదైంది. ఇకపోతే దేశంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతాల్లో డయ్యు అండ్ డామన్, లక్ష్యదీప్‌లు సురక్షిత ప్రాంతాలుగా ఉన్నాయి. ఇక్కడ 5,25,600 నిమిషాలకు ఒక కేసు నమోదవుతోంది. దేశంలోని మిగిలి రాష్ట్రాలతో పోల్చి చూస్తే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి 174.6 నిమిషాలకు ఒక మహిళ అత్యాచారానికి గురవుతోంది. అందుకే ఈ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
మెదక్ ఎంపీ స్థానం నుంచి ప్రియాంక పోటీ!?
కసాబ్ పాకిస్తాన్ మనిషే: నవాజ్ షరీఫ్
'ఆనందం-ఆరోగ్యం'లోనూ 'లిటిల్ ఛాంపియన్' ఫస్ట్
భార్గవి నన్ను పట్టించుకోలేదు.. అందుకే...
బుష్‌పై విసిరిన బూట్లకు రాజయోగం...!
ఇప్పుడెవరిని ఎన్‌కౌంటర్ చేస్తారు...?