ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్ > ప్రపంచీకరణపై భారతీయ యువత నిరాసక్తత
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ప్రపంచీకరణపై భారతీయ యువత నిరాసక్తత
FILE
భారతీయ యువతలో మూడింట రెండొంతుల మందికి ప్రపంచీకరణ గురించి ఏ మాత్రం తెలీదని తాజా అధ్యయనం తెలిపింది. తమ మతానికి సంబంధించని అవతలి వ్యక్తులతో స్నేహ సంబంధాలు నెలకొల్పుకోవడంలో భారతీయ యువతలో ఒక విభాగం ఇప్పటికీ సాంప్రదాయిక భావాలతోటే ఉన్నారని ఈ అధ్యయనం చెప్పింది.

"మారుతున్న ప్రాపంచిక విలువలు, అవగాహనలో భారతీయ యువత" అనే పేరిట తను చేసిన అధ్యయన ఫలితాలను వర్థమాన సమాజాల అధ్యయన సంస్థ -సిఎస్‌డిఎస్- ఇటీవలే న్యూఢిల్లీలో వెలువరించింది. జర్మనీ మూలాలు కలిగిన అంతర్జాతీయ సంస్థ -కెఎఎస్-తో కలిసి ఈ అధ్యయనాన్ని రూపొందించింది.
మద్యం సరే.. స్నేహం మాటేమిటి?
  భారతీయ యువత మద్యాన్ని ఇప్పటికీ నిషిద్ధ వస్తువులాగే చూడటం మంచిదే కానీ, కులాన్ని, మతాన్ని, లింగాన్ని దాటి స్నేహం పెంచుకోవడంలో యువత నేటికీ పరిధులు దాటలేక పోవడం ఆలోచించవలసిన విషయమే. ప్రపంచీకరణ దేశంలో చాలామందిని తాకలేదని అర్థమవుతోంది మరి..      


భారతీయ యువతలో దాదాపు 29 శాతంమంది ఇప్పటికీ గ్లోబలైజేషన్ అంటే ఏమిటో తెలీని స్థితిలోనే ఉన్నారని ఈ అధ్యయనం తెలిపింది. కాగా 66 శాతం మంది మద్యాన్ని నిషిద్ధ వస్తువులాగే చూస్తున్నారని ఈ సర్వే తెలిపింది. యువతలో 48 శాతం మంది తాము ప్రజాస్వామిక విలువల పట్ల ఇప్పటికీ విశ్వాసం కలిగి ఉన్నామని చెప్పగా 27 శాతంమంది వ్యతిరేకత తెలియజేశారు.

భారతీయ యువ జనాభాలో గూడు కట్టుకుని ఉన్న ప్రాథమిక వైఖరిని వెలికి తీయడానికి ఈ సర్వే ప్రయత్నించిందని ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు యోగేంద్ర యాదవ్ చెప్పారు. యువతలో గూడు కట్టుకుని ఉన్న ఉన్న రాజకీయ, సామాజిక విలువలను అధ్యయనం చేసేందుకు ఈ సర్వేని చేపట్టామని తెలిపారు.

భారతీయ యువతలో కుటుంబం ఈనాటికీ అత్యున్నత సంస్థగా ఉంటుందని, యువతపై నేటికీ తల్లిదండ్రుల అధికారమే కొనసాగుతోందని సర్వే తెలిపింది. తమ వివాహానికి సంబంధించి తుది నిర్ణయం తీసుకోవలసింది తల్లిదండ్రులేనని 60 శాతం యువత భావిస్తున్నారు. కుటుంబ మద్దతు వ్యవస్థ అమూల్యమైనదని యువత భావన. ఇతర లింగం, మతం లేదా కులానికి సంబంధించిన స్నేహితులు లేరని దేశ యువతలో 27 శాతం మంది అంగీకరించడం ఆశ్చర్యకరమైన విషయమని సర్వే తెలిపింది.

ఓటు హక్కు వంటి రాజకీయ, సామాజిక భద్రత గురించి దళిత వర్గాలు ఇప్పటికీ ఆందోళన చెందుతున్నందున దేశంలో గ్లోబలైజేషన్, దళిత యువతకు మధ్య ఈనాటికీ సంబంధం లేదని రాజస్థాన్‌ దళిత సామాజిక సంస్థకు చెందిన భన్వర్ మేఘవంశీ చెప్పారు. దేశంలో యువత భావాల్లో మార్పులు వస్తున్నాయి కానీ రాజకీయాల్లో మాత్రం ఇంకా మార్పులు రాలేదని అధ్యయన ప్యానెల్ సభ్యులైన ఎంపీ సచిన్ పైలట్ పేర్కొనడం గమనార్హం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
తాజ్ హోటల్‌కి ఇదే ఆహ్వానం...
న్యూఢిల్లీలో పెరుగుతున్న అత్యాచారాల సంఖ్య
మెదక్ ఎంపీ స్థానం నుంచి ప్రియాంక పోటీ!?
కసాబ్ పాకిస్తాన్ మనిషే: నవాజ్ షరీఫ్
'ఆనందం-ఆరోగ్యం'లోనూ 'లిటిల్ ఛాంపియన్' ఫస్ట్
భార్గవి నన్ను పట్టించుకోలేదు.. అందుకే...