ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్ > ముంబై దాడులు: నిజంగా ఓడింది ఎవరు?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ముంబై దాడులు: నిజంగా ఓడింది ఎవరు?
శత్రువు చేత, రక్షణ పరమైన వైఫల్యాల చేత, వ్యూహ అసమర్థతల చేత ఇంతగా గాయపడినప్పటికీ భారత్‌ అంతిమంగా గెలిచిందంటే ఆశ్చర్యం కలుగవచ్చు. కాని ఇది నిజం. ప్రజల ఐక్యత, సంఘీభావం ముందు ఉగ్రవాదులు నిజంగా ఓడిపోయారు.

పాక్‌లోని తరతరాల ప్రజలు కూడా తమ గడ్డకు చెందిన వారు నిష్కారణంగా, ఘోరంగా ముంబైలో జనహననానికి పాల్పడినారని తన బిడ్డలకు పరంపరాగతంగా కథలు చెప్పుకునేంతగా ఉగ్రవాదుల ముంబై ప్రజల, దేశ ప్రజల ముందు ఓడిపోయారు.

ప్రభుత్వాలకు సాధ్యం కాని, సకాలంలో దేశ రక్షణ బలగాలకు సాధ్యం కాని ఈ పరిణామం ఎలా సాధ్యమైంది? ఉగ్రవాదులు హద్దుమీరి ముంబైలో సాగించిన రాక్షస కాండ దేశ ప్రజల్లో ఎన్నడూ లేనంత ఐక్యతను తీసుకొచ్చింది.

ముంబై దాడుల మూలంగా దేశానికి మరో విధంగా జరిగిన అతి పెద్ద మేలు ఏదంటే, ఈ దాడుల తర్వాత ముస్లిం మత పెద్దలు, నేతలు ఎన్నడు లేనంత తీవ్రస్థాయిలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మాట్లాడడమే. ఉగ్రవాద దాడి జరగ్గానే మొత్తం ముస్లిం మతాన్నే బోనులో ఎక్కించి అనుమానాలు వ్యాపింపజేసే అనుమాన పక్షులను ఈ దఫా దాడుల తర్వాత ముస్లిం మత నేతలు చావు దెబ్బ కొట్టారు.

పాకిస్తాన్ ప్రేరేపిత శక్తులచే అనూహ్య దాడికి గురైన అవమానం భరించిన జాతి ముక్తకంఠంతో ఉగ్రవాద ఘాతుకచర్యను దుయ్యబట్టింది. ముంబై దాడి ప్రత్యక్ష ప్రసారం జరిగినప్పటినుంచి పాకిస్తాన్‌లో శాంతికాముకులైన ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారనే చెప్పాలి. తమ దేశానికి చెందిన కొద్దిమంది యువకులు కలిసి ఇరుదేశాల మధ్య దీర్ఘకాలంగా సాగుతున్న శాంతియుత పరిస్థితిని ఒక్కసారిగా సంవత్సరాల వెనుకకు నెట్టారని వీరు కలవరపడుతున్నారు.

2008లో నగరాల్లో ఉన్న నూతన తరం ముంబైలో ఉగ్రవాదుల ఘాతుకాన్ని జీవితకాలంలో మర్చిపోలేరు. పాకిస్తాన్ నుంచి ఎకె 47 రైఫుళ్లను ధరించి సాధారణ దుస్తులతో వచ్చిన కొంత మంది యువకులు తమ బాల్యంలో ముంబై నగరంలో జరిపిన దారుణ చర్య గురించి ఈ నూతన తరం ఎన్నటికీ మర్చిపోదని పరిశీలకుల భావన. ఈ దాడి కలిగించే మానసికపరమైన ప్రభావం తీవ్రతను మనం సరిగా అంచనా వేసినట్లయితే, పాకిస్తాన్‌లోని రాడికల్స్, తీవ్రవాదులు ఇప్పటికీ తమ యుద్ధాన్ని కోల్పోయారని చెప్పవలసి వస్తుంది.

ముంబై దాడుల సందర్భంగా హిందూ-ముస్లిం ఐక్యత భారత్‌లో అతి సుందరంగా ఆవిష్కరించబడింది. ఈ ఐక్యత యొక్క నూతన అవతారాన్ని ముంబైలో అయినా జాతి దర్శించగలిగింది. అదే సమయంలో అయిదు దశాబ్దాల తీవ్ర ఘర్షణ అనంతరం ఇరుదేశాల మధ్య నెలకొన్న సామరస్య ధోరణి కేవలం ఒకరాత్రిలోనే చెదిరిపోయిన దృశ్యాన్ని చూసి శాంతికాముకులైన ఇరు దేశాల ప్రజలు కలవరపడుతున్నారు.

ఏది ఏమైనా స్వాతంత్ర్యానంతరం ఎన్నడూ లేనంతగా ముంబై దాడుల నేపధ్యంలో భిన్నమతాల ప్రజల మధ్య నెలకొన్న ఐక్యత, పరస్పర సహాయ సంస్కృతిపైనే భారతజాతి మనుగడ ఆధారపడి ఉంది. దెబ్బతిన్న భారత్ ఇంతవరకు సహన భావంతో తన నైతిక ఆధిక్యతను ప్రపంచానికి చాటగలిగింది. ఇది కొనసాగితేనే మంచిది.

యుద్ధం మీట నొక్కడం చాలా సులభం... తర్వాత దాని పరిణామాలు ఎవరి ఊహలకూ అందవు. కనీసం భారత్ పాక్ రాజకీయ నేతలు ఈ సమయంలోనైనా విజ్ఞతను పాటిస్తారని దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు.
<< 1 | 2 
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
నూతన సంవత్సరం: జ్యోతిష్కులకు పెరిగిన డిమాండ్
ముంబై మారణహోమానికి ముప్ఫై రోజులు
దేశంలో కనుమరుగవుతున్న పులులు!
ప్రపంచీకరణపై భారతీయ యువత నిరాసక్తత
తాజ్ హోటల్‌కి ఇదే ఆహ్వానం...
న్యూఢిల్లీలో పెరుగుతున్న అత్యాచారాల సంఖ్య