ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్ > శతాబ్ది న్యూస్ పోల్‌లో ఒబామాకే అగ్రస్థానం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
శతాబ్ది న్యూస్ పోల్‌లో ఒబామాకే అగ్రస్థానం
FILE
అమెరికా కాబోయే అధ్యక్షుడు ఒబామా బరాక్ ఈ శతాబ్ది వార్తల్లో ప్రథముడిగా ఎంపికయ్యారు. అమెరికా అధ్యక్షుడిగా ఎంపిక కావడంలో ఒబామా సాగించిన ప్రస్థానానికి ప్రపంచం మొత్తం మీద అద్వితీయమైన కవరేజ్ వచ్చిందని ప్రపంచ వ్యాప్త మీడియా సర్వేలో తెలిసింది.

శతాబ్ది మొత్తంలో ఇంత విస్తృత కవరేజీని మరే వ్యక్తి కాని సంఘటన కాని పొందలేదని ఈ సర్వే చాటి చెప్పింది. ప్రపంచంలోని మరే ఇతర సంఘటనతో అయినా పోల్చి చూస్తే ఒబామా ఎన్నికల ప్రచారానికి రెండు రెట్లు అధికంగా కవరేజ్ వచ్చిందని సర్వే చెప్పింది.

ఒబామాకు దక్కిన ప్రచారం కనీవినీ ఎరుగని రీతిలో ఉందని ఈ సర్వేని నిర్వహించిన గ్రోబల్ లాంగ్వేజ్ మోనిటర్ అధ్యక్షుడు పాల్ పేయాక్ చెప్పారు. ప్రపంచాన్ని ఒబామా తన చెంత కట్టిపడేసుకున్నారని పాల్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రింట్, ఎలెక్ట్రానిక్ మీడియా, ఇంటర్నెట్ బ్లాగులలో అత్యధిక ప్రచారం ఎవరు పొందారనే అంశంపై ఈ సర్వే పరిశోధించింది.

ఇరాక్ యుద్ధం, బీజింగ్ ఒలింపిక్స్, ప్రపంచ ఆర్థిక సంక్షోభం, కత్రినా తుపాన్, పోప్ జాన్ పాల్ 2 మృతి, న్యూయార్క్, వాషింగ్టన్ డిసిలో సెప్టెంబర్ 11 దాడులు, దక్షిణాసియాలో సునామి తదితర వార్తలను ఒబామా ప్రచార కవరేజ్ అవలీలగా అధిగమించిందని ఈ సర్వే నిర్వాహకుడు పాల్ చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా మీడియా ఒబామా గురించి 25 కోట్ల సార్లు రాశారని చెప్పారు.

ప్రపంచంలోని ఇతర అన్ని భారీ సంఘటలపై వచ్చిన కవరేజ్ మొత్తాన్ని కలిపినా ఒబామాపై కవరేజ్‌లో సగానికి కూడా చేరుకోలేదని ఈ సర్వే చాటి చెప్పింది. చివరకు బ్లాగులలో సైతం మూడింట కవరేజ్ ఒబామాపైనే జరిగిందని పాల్ చెప్పారు.

ఇలా ప్రింట్, ఎలెక్ట్రానిక్, ఇంటర్నెట్ మీడియా మూడింట్లోనూ ప్రచార కవరేజ్ విషయంలో ఒబాకు ధీటుగా వచ్చే వ్యక్తి, ఘటన లేకుండా పోయిందని ఈ సర్వే తేల్చి చెప్పింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఒబామాకే తప్పని విద్యుత్ సమస్య
ముంబై దాడులు: నిజంగా ఓడింది ఎవరు?
నూతన సంవత్సరం: జ్యోతిష్కులకు పెరిగిన డిమాండ్
ముంబై మారణహోమానికి ముప్ఫై రోజులు
దేశంలో కనుమరుగవుతున్న పులులు!
ప్రపంచీకరణపై భారతీయ యువత నిరాసక్తత