ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్ > నేలకొరిగిన సద్దాం హుస్సేన్: నేటికి రెండేళ్ళు పూర్తి
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నేలకొరిగిన సద్దాం హుస్సేన్: నేటికి రెండేళ్ళు పూర్తి
PNR
Sr Sub-Editor
FileFILE
సద్దాం హుస్సేన్.. అగ్రరాజ్యం అమెరికాతో పాటు ప్రపంచ ఆయిల్ కంపెనీల సామ్రాజ్యవాదులను గడగడలాడించిన ఇరాక్ అధ్యక్షుడు. 1976 జూలై 16 నుంచి 2003 ఏప్రిల్ తొమ్మిదో తేదీ వరకు ఇరాక్‌ను అప్రతిహతంగా పాలించిన సద్దామ్ హుస్సేన్‌ను 2006 డిసెంబరు 20వ తేదీన ఉరికంభానికి వేలాడదీశారు.

తాను అధికారంలో ఉన్నంత కాలం ఇరాక్ రాజుగానే కాకుండా ప్రపంచ దేశాలపై సైతం తన ఆధిపత్యాన్ని చెలాయించిన యుద్ధోన్మాది. అమెరికా ఆధ్వర్యంలో జరిగిన ఇరాక్ ఆక్రమణలో పదవి కోల్పోయారు. యుద్ధానంతరం అమెరికా సేనలకు బందీగా పట్టుబడి, ఇరాక్ న్యాయస్థానంలో విచారణ తరువాత ఉరిశిక్షకు గురయ్యారు.

అరబ్ ప్రపంచంలో ఇరాక్‌కు ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిన సద్దాం హుస్సేన్.. 1968 సంవత్సరం నుంచి తన తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ రాజనీతిని గడించారు. యుద్ధ మెళకులు నేర్చుకున్నారు. ముఖ్యంగా ఇరాక్‌ను ఆధునీకరణ వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. విదేశీ సామ్రాజ్యవాదుల చేతిలో ఉన్న ఇరాక్ చమురు సంస్థలను స్వాధీనం చేసుకుని జాతీయకరణం చేసిన ఘనత సద్దాం హుస్సేన్‌కు దక్కుతుంది.

ఈ చర్యతో సామ్రాజ్యవాదులందరూ సద్దాంకు వ్యతిరేకంగా చేతులు కలిపారు. ఇదిలావుండగా.. మైనారిటీల్లో ఒక తెగ అయిన సున్నీ వంశస్థులను సద్దాం హుస్సేన్ ప్రోత్సహించాడు. తాను ఈ తెగకు చెందిన వాడే కావడం ఇందుకు ఒక కారణం. అయితే మెజారిటీ తెగ షియాల నుంచి సద్దా వైఖరి పట్ల తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. మరో వైపు ఇరాక్ కమ్యూనిస్ట్ పార్టీ, కుర్ద్ తిరుగుబాటుదారులు కూడా సద్దాంకు వ్యతిరేకంగా పావులు కదిపారు.

ఎవరైతే.. తనను వ్యతిరేకించారో వారందరిపై ఉక్కుపాదం మోపేందుకు సద్దాం ఏమాత్రం వెనుకంజ వేయలేదు. షియా తెగకు చెందిన ముస్లిం ప్రజలను ఊచకోత కోయడం ఇందుకు ఓ మంచి ఉదారహరణ. అంతేకాకుండా 1980లో ఇరాక్‌లో అణు రియాక్టర్‌ను నెలకొల్పాడు. దీన్ని 1981 సంవత్సరం ఇరాన్ నాశనం చేసింది. ఆ తర్వాత జరిగిన గల్ఫ్ యుద్ధం సద్దాం హుస్సేన్‌ను యుద్ధోన్మాదిగా చిత్రీకరించింది.

అప్పటి వరకు అనుకూలంగా ఉన్న అమెరికా.. సెప్టెంబర్ 11వ తేదీన జరిగిన దాడుల తర్వాత వైఖరిని మార్చుకుంది. సద్దాం ధిక్కారానికి ఫుల్‌స్టాఫ్ పెట్టాలని నిర్ణయించింది. ఇరాక్‌పై యుద్ధం ప్రకటించింది. దీంతో 2003 ఏప్రిల్ 9వ తేదీన సద్దాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

రెండేళ్ళ తర్వాత అమెరికా సంకీర్ణ సేనలు సద్దాంను 2006 నవంబరు ఆరో తేదీన బంధించాయి. అమెరికా చెప్పుచేతల్లోని ఇరాకీ ప్రభుత్వం సద్దాంకు ఉరిశిక్షను విధించింది. ఇదే ఏడాది డిసెంబరు 30వ తేదీన ఇరాక్ ప్రభుత్వం సద్దాంను ఉరికంభానికి వేలాడదీసింది.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
శతాబ్ది న్యూస్ పోల్‌లో ఒబామాకే అగ్రస్థానం
ఒబామాకే తప్పని విద్యుత్ సమస్య
ముంబై దాడులు: నిజంగా ఓడింది ఎవరు?
నూతన సంవత్సరం: జ్యోతిష్కులకు పెరిగిన డిమాండ్
ముంబై మారణహోమానికి ముప్ఫై రోజులు
దేశంలో కనుమరుగవుతున్న పులులు!