ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్ > హ్హ... హ్హహ్హ... హ్హహ్హహ్హ... విరగబడి నవ్వండి!!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
హ్హ... హ్హహ్హ... హ్హహ్హహ్హ... విరగబడి నవ్వండి!!
IVR
IFM
"నవ్వుతూ బ్రతకాలిరా... తమ్ముడూ నవ్వుతూ చావాలిరా" అని ఒక కవి అంటే "ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు" అని మరో కవి ఏనాడో చెప్పేశాడు. "మూడీగా ఉండొద్దు ఓ బ్రదరో..." అంటూ మన ఆధునిక సినీ కవులు పదేపదే చెబుతున్నారు. అయినా నవ్వటానికి సమయమేదీ...?

తనివితీరా నవ్వితే.. మా బాసుగాడు కస్సుమంటాడు... ఓ ఉద్యోగి
నేను నవ్వటం గనక చూశారో.... మా ఆయన ఊరుకోడు... ఓ భార్యామణి
పెద్దగా నవ్వితే మా అమ్మా నాన్నలు కొడతారు... ఓ చిన్నారి
నాకసలు నవ్వే రావడం లేదు... ఓ వ్యాపారి
ఏమిటే అలా పగలబడి నవ్వుతున్నారూ... ఓ మామ్మ అదిలింపులు
... ఇలా అందరూ నవ్వలేక... నవ్వేవాళ్లని నవ్వనీయక ఆరోగ్యాలను పాడుచేసుకుంటూ.. పాడుచేస్తూ ఉన్నారు. రోజుకు కనీసం 30 నిమిషాలైనా మనసారా నవ్వకపోతే అనారోగ్యం తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు.

ఎందుకంటే నవ్వులో పాజిటివ్ భావాలతో పాటు హీలింగ్ ప్రక్రియ కూడా ఉంది. డాక్టర్ మదన్ కటారియా లాఫ్టర్ క్లబ్ స్థాపకునిగా మనదేశంలో 1300 క్లబ్బులు, విదేశాల్లో 700 పైగా నెలకొల్పి 'అంతా నవ్వండి, నవ్వించండి' అని ప్రచారం చేస్తున్నారు. నవ్వుకు ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించిన కటారియా విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

హాస్యం మన సమస్యల్ని దూరం చేస్తుంది. హాయిగా గాఢమైన నిద్ర పడుతుంది. అమెరికాలోని 'సండే రివ్యూ' పత్రికా సంపాదకుడు నార్మెన్ క్యూసిన్స్ బాగా జబ్బుపడితే... అతను ఇక కొన్నిరోజులే బ్రతుకుతాడని డాక్టర్లు చెప్పేశారు. చివరి ప్రయత్నంగా అతనికి లాఫింగ్ థెరపీ చేశారు. అతను ఓ పది నిమిషాలపాటు కడుపుబ్బ నవ్వేవిధంగా అనేక కామిక్స్ చూపించారు. ఈ ప్రక్రియను కొన్నాళ్లు అలానే సాగించారు. అంతే ఆయన జీవితకాలం పెరిగింది.

కనుక నవ్వటం అనేది ఓ ఆరోగ్య సూత్రం. అందుకని ఈ ప్రపంచ హాస్య దినోత్సవం రోజునుంచి మనమందరం తనివితీరా నవ్వుకుందాం. హ.. హ్హ... హ్హ్హ.... గట్టిగా నవ్వండి... కడుపుబ్బ నవ్వండి. నవ్వించండి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
'సత్యం' రాజు వికాస పతనాలు
వైవిధ్య శాటిలైట్‌ను ఆవిష్కరించనున్న భారత్
మరణంలోనూ ఆయనే హీరో : కవితా కర్కరే
పడి లేచిన కెరటం: ఫలించిన ఆరేళ్ళ కల
ఏ ఆడదానికి నా గతి పట్టకూడదు: స్వప్నిక
నేలకొరిగిన సద్దాం హుస్సేన్: నేటికి రెండేళ్ళు పూర్తి