ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్ > చెదిరిపోతున్న చెన్నై చెరసాల!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
చెదిరిపోతున్న చెన్నై చెరసాల!
WDWD
బందీలుగా ఉన్న వీఐపీ ఖైదీలు..
ఈ జైలులో అనేక మంది రాజకీయ ప్రముఖులు ఖేదీలుగా ఉన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు వీర్ సవార్కర్ (మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో), మాజీ ప్రధాని అన్నాదురై (1963), జయలలిత (1996), కరుణానిధి (2001), కంచి మఠం జూనియర్ పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి, కరుణానిధి తనయుడు ఎంకే.స్టాలిన్, నటులు ఎం.ఆర్.రాధా, గానా ఉలగనాథన్, మాన్సూర్ ఆలీఖాన్, ఎన్ఎన్.కృష్ణన్, త్యాగరాజ భాగవతార్‌లు ఉన్నారు.

అలాగే ఎల్టీటీఈ చీఫ్, పెద్దపులి ప్రభాకరన్ (1982), అడవిదొంగ వీరప్పన్ సోదరుడు మాతయ్య వంటి వారికి ఆతిథ్యం ఇచ్చిన ఘనమైన చరిత్ర ఈ జైలు సొంతం. అన్నాదురై ఖైదీగా ఉన్న సమయంలో ఆయనకు 6452 అనే నంబరును ఇచ్చారు. ఈ జైలు ప్రాంగణంలో ధ్యాన కేంద్రం, ఓపెన్ ఆడిటోరియం, విదేశీ ఖైదీల సెల్, సాధారణ, కరుడుగట్టిన నేరస్తుల విభాగం, రాజకీయ నేతల విభాగం, డార్క్ ప్రిజన్, ఓల్డేజ్ ట్యూషన్ కేంద్రం, శివాలయం, ఆస్పత్రి, భారీ వంటగది ఉన్నాయి.

కారాగారంలో సంచనాలెన్నో..
కేంద్ర కారాగారంలో చోటు చేసుకున్న సంచనాలకు కొదువ లేదు. ఎల్టీటీఈకి చెందిన ఎనిమిది మంది తీవ్రవాదులు ఇక్కడ నుంచి తప్పించుకున్నారు. ఈ సంఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది. పేరుమోసిన రౌడీగా పేరొందిన ఆటో శంకర్ జైలు నుంచి పారిపోయాడు. 1999 నవంబరులో చేటు చేసుకున్న ఘర్షణల్లో జైలర్ జయరామన్‌, వార్డెన్ నటరాజన్‌తో సహా 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనే కేంద్ర కారాగారాన్ని వేరే చోటికి మార్చేందుకు ఊతమిచ్చింది.

సినిమాలోనూ..
చెన్నై కేంద్ర కారాగారాన్ని పుళల్‌కు మార్చడానికి ముందే పలు చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. పద్మశ్రీ కమల్ హాసన్ నటించిన "మహానంది" చిత్రంలోని సింహభాగాన్ని ఇక్కడే చిత్రీకరించారు. అలాగే 1999లో చోటు చేసుకున్న ఘర్షణలను ఆయన నటించిన మరో చిత్రం "విరుమాండి"లో కళ్ళకు కట్టినట్టు చూపించారు. ఇటీవల విడుదలైన "పళని" చిత్రంలోనూ జైలులోని చాలా భాగాన్ని చూపించారు. ఇలా.. తమిళ చిత్రాల నిర్మాణంలో కేంద్ర కారాగారం ప్రత్యేక పాత్ర పోషించింది.

చరిత్ర పుటల్లోకి ఓ సారి...
* 1837 సంవత్సరంలో జైలు నిర్మాణం పూర్తి.
* 1855 నుంచి కేంద్ర కారాగార హోదా.
* రెడ్ అనే ఆంగ్లేయుడు జైలు తొలి అధికారిగా నియామకం.
* 1951లో తొలి భారతీయ అధికారిగా ఏఎన్.రాయ్ నియామకం.
<< 1 | 2 
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple, Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
తాత వస్తువులకు మనవడి ఆరాటం
ఆహార ధాన్యాల ధరలు మోతెక్కుతాయ్
అత్యుత్తమమైన అధ్యక్షుడు లింకన్
భారత్‌కు తీరనున్న అణు ఇంధన కొరత
స్నైపర్స్ అంటే తాలిబన్లకు దడ
2020నాటికి దేశంలో నీటికి కటకట