ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్ > ఆర్థిక మాంద్యం: టాప్‌లెస్ డ్యాన్సులకు క్యూ
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
ఆర్థిక మాంద్యం: టాప్‌లెస్ డ్యాన్సులకు క్యూ
WD
ఆర్థిక మాంద్యంతో ప్రపంచం అతలాకుతలమవుతోంది. జి-20 సదస్సులో సైతం నాయకులందరూ ఆర్థిక రక్కసిని ఎలా పారదోలలా... అనే అంశంపైనే చర్చించుకున్నారు. కనుక దీని తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆర్థిక మాంద్యంతో ఉద్యోగాలు పోయి వీధినపడిన వారందరూ ఏ పని దొరకక బిక్కుబిక్కుమంటున్నారు. విదేశాలలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఉద్యోగాలు లేని కారణంగా విదేశాలలోని కొందరు మహిళలు బార్ అండ్ రెస్టారెంట్లలలో టాప్‌లెస్ నృత్యాలు చేస్తామని ఎగబడుతున్నారట. చికాగోలోని నేషనల్ రెస్టారెంట్‌లో ఓ మహిళ గత వారం టాప్‌లెస్ డ్యాన్సు చేసి డాలర్లకు డాలర్లు మూటగట్టుకున్నదట. చికాగోలోని పింక్ మంకీ జెంటిల్మన్ క్లబ్‌లో ఆమె ఓ డ్యాన్సర్. అయితే ఆ ఆదాయం చాలకపోవడంతో వారంలో ఒకరోజు టాప్‌లెస్ డ్యాన్సు చేయాలని నిశ్చయించుకుందట.

మరోవైపు నృత్యంలోనూ పోటీ ఎక్కువైందనీ, నిరుద్యోగులైన మహిళలు చాలా మంది డ్యాన్సులు చేయడానికి సిద్ధమవుతుండటంతో తనకు టాప్‌లెస్ డ్యాన్స్ తప్పడం లేదంటోంది సదరు మహిళ. ఇదిలా ఉంటే టాప్‌లెస్ నృత్యాలకు తాము సైతం సిద్ధమని అమెరికాలోని బార్ అండ్ రెస్టారెంట్లకు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు వచ్చిపడుతున్నాయట.

దరఖాస్తులు పరిశీలించిన బార్ అండ్ రెస్టారెంట్ యాజమాన్యాలు అచ్చెరువొందుతున్నాయట. కాలేజీ, డిగ్రీ స్థాయి యువతుల నుంచి చిన్నా చితకా ఉద్యోగాలు చేసుకునే మహిళల వరకూ అందరూ వారంలో ఒకరోజు టాప్‌లెస్ డ్యాన్సులు చేయడానికి సిద్ధమని తమ దరఖాస్తులలో తెలిపారట. టాప్‌లెస్ డ్యాన్స్ చేయడం పూర్తయిన మరుక్షణమే చేతిలోకి డబ్బు వచ్చి పడుతుండటంతో చాలామంది ఈ వృత్తిపై మక్కువ చూపుతున్నట్లు సదరు కంపెనీ తెలిపింది.

ఇదే అదనుగా న్యూయార్క్‌లోని ఓ రెస్టారెంట్, టాప్‌లెస్ నృత్యం చేయడానికి ఆసక్తిగల మహిళల నుంచి దరఖాస్తులు కోరిందట. దరఖాస్తులో "అందమైన మహిళలు మాత్రమే అర్హులు" అని నిబంధన సైతం జోడించిందట. చిత్రంగా ఒకే రోజున ఆ కంపెనీకి ఏకంగా 85 మంది అందమైన అమ్మాయిలు దరఖాస్తు చేసుకున్నారట.

టాప్‌లెస్ డ్యాన్సు చేసేటపుడు తొలుత కాస్త చిరాగ్గా, అసహనంగా అనిపించినప్పటికీ చేతికి వెంటనే పైకం అందటం తమకెంతో భరోసానిస్తుందని టాప్‌లెస్ డ్యాన్సుల్లో పాల్గొన్న కొత్తవారు చెపుతున్నారట. ఏదేమైనప్పటికీ ఆర్థిక మాంద్యం ప్రభావంతో ఇటువంటి వృత్తులలోకి మరలుతున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్లు పింక్ మంకీ జెంటిల్మన్ క్లబ్ అధికారి ఒకరు తెలిపారు.

వారానికి కనీసం 30 మంది మహిళలు తమ క్లబ్‌ నుంచి నృత్యంలో తర్ఫీదు పొంది టాప్‌లెస్ నృత్యాలు చేయడానికి వెళుతున్నారని ఆయన పేర్కొన్నారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
ఆకలిలోనూ మన దేశమే ఫస్ట్
ఏప్రిల్ ఫూల్ కథా...కమామీషు
2007లో రాజకీయాలనుంచి వైదొలగాలనుకున్నా..అద్వానీ
దేశంలో పెరుగుతున్న రాజకీయ పార్టీలు!
మహాత్ముని ఆత్మకథ చదువుతున్నా..కసబ్
తుఫానుల పేర్లు..కథాకమామీషు