ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్ > సూపర్ నోవా తొలి చిత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
సూపర్ నోవా తొలి చిత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
FileFILE
ప్రపంచంలో సూపర్ నోవా పేలుడు తొలి ఛాయా చిత్రాన్ని అంతరిక్ష శాస్త్రవేత్తలు కనుగొన్నారు. గోళాకారం అక్షం యొక్క రెండు కొనలలో వాయువు విస్తరిస్తున్నట్లుగా చూపించే ఈ ఛాయా చిత్రాన్ని చీలీకి చెందిన నగోయా యూనివర్శిటీ అంతరిక్ష పరిశోధకుల బృందం కనుగొంది.

అంతరిక్ష శాస్త్రవేత యూసువో ఫుకుయి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం యూనివర్శిటీకి చెందిన అత్యంత శక్తివంతమైన నాన్‌టెన్ రేడియో టెలీస్కోప్ ద్వారా ఈ ఛాయాచిత్రాన్ని తీశారు. భూమి నుండి సుమారు 17వందల కాంతి సంవత్సరాల దూరంలో కరీనాలోని నక్షత్రరాశుల గుంపు ఒక్కసారిగా పేలినట్లు ఈ ఛాయాచిత్రంలో ఉంది.

పురాతనమైన ఈ సూపర్‌నోవా నక్షత్ర రాశుల విస్ఫోటనం నుండి వెలువడిన వాయువు మేఘాలు గోళాకారంగా, దీర్ఘ/ఒకేవరుసగా విస్తరించాయని ఫుకుయ్ చీలీకి చెందిన క్యోడో వార్తా పత్రికకు వెల్లడించారు. ఇలాంటి గోళాకార మార్పులు ఇదివరకే అంతరిక్ష శాస్త్రవేత్తలు గుర్తించారని తెలిపారు.

అయితే ఈ వాయువు మేఘాలు ఒకే వరుసగా విస్తరించడం హేతుబద్ధతపై ఆధారపడి సిద్ధాంతపరంగా మాత్రమే గతంలో రుజువు చేశారని.. వివరించారు. ఈ ఛాయా చిత్రం ద్వారా సూపర్ నోవా ఏ విధంగా ఉంది? అది ఎలా విస్ఫోటనం చెందిందో? తెలుసుకునేందుకు ఉపయోగపడుతుందని ఆయన వెల్లడించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
స్వైన్ ఫ్లూ రోగులను పసిగట్టే ధర్మల్ స్కానర్స్
పదవీ గండంలో కేసీఆర్ అటూ ఇటూ...?
తిరుమలేశునికి ఎప్పటికీ ఋణగ్రస్తులమే
ఇది 12వ దాడి: భారతీయులంటే ఎందుకింత ఈర్ష్య...?
అనుభవ రాహిత్యమా?.. చాణక్య తంత్రమా!
కేసీఆర్‌పై మాటల దాడి... మర్మమేమి రాజశేఖరా