ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్ > యమలోకపు ఏజెంట్‌‌గా "స్వై(ర)న్" విహారం
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
యమలోకపు ఏజెంట్‌‌గా "స్వై(ర)న్" విహారం
PNR
FileFILE
స్వైన్ ఫ్లూ... ప్రపంచ దేశాలను వణికిస్తున్న వైరస్. అగ్రదేశం అమెరికాకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. మెక్సికో అల్లకల్లోలమైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ బెంబేలెత్తిపోయింది. ఆధునిక వైద్య రంగం వణికి పోతోంది. ఎక్కడో మెక్సికోలో బయల్పడిన స్వైన్ ఫ్లూ... ఇప్పటి వరకు 200 మందిని బలితీసుకుంది. "యమలోకపు ఏజెంట్‌గా.. భూలోకంలో వికటాట్టహాసం" చేస్తున్న ఈ వైరస్... వైద్య శాస్త్ర, పరిశోధనా రంగానికే సరికొత్త సవాల్‌గా పరిణమించింది.

దీంతో వైద్య లోకమే నివ్వెర పోయింది. ఈ వైరస్‌ను అరికట్టేందుకు శక్తియుక్తులా కృషి చేస్తోంది. అయితే, ప్రతి రోజూ ఎక్కడో ఒకచోట.. ఏదో ఒక ప్రాంతంలో పలువురు ఈ వ్యాధి బారిన పడినట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. జులై నెలాఖరు నాటికి దక్షిణార్థగోళంలోని దేశాల్లో ఈ వ్యాధి వ్యాపించడం ఖాయమని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. అందువల్లే స్వైన్ ఫ్లూను సరిహద్దులు లేని మహమ్మారిగా అభివర్ణించింది.

దీంతో అప్రమత్తమైన ప్రపంచ దేశాలు వ్యాధిని అరికట్టేందుకు సకల చర్యలు చేపట్టాయి. తమ దేశాల్లోని అంతర్జాతీయ విమానాశ్రయాల ద్వారా రాకపోకలు సాగించే ప్రయాణికులకు విధిగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నాయి. ఈ పరీక్షల్లో ఈ వైరస్ లక్షణాలు లేవని నిర్థారించిన తర్వాతే వారిని సురక్షితంగా బయటకు వదిలి పెడుతున్నారు. ఇలా ప్రపంచ మానవాళిని వణికిస్తున్న ఈ వైరస్... మరో స్పానిష్ ఫ్లూను తలపిస్తుందా అనేది ప్రస్తుతం శాస్త్రవేత్తలను వేధిస్తున్న ప్రధాన ప్రశ్న?

1918లో స్పెయిన్‌‌ను అంతుచిక్కని వైరస్ అతలాకుతలం చేసింది. దీనికి స్పానిష్ వైరస్‌గా నామకరణం చేశారు. ఈ వైరస్ అతివేగంగా
FileFILE
ప్రపంచ దేశాలకు విస్తరించింది. ఫలితంగా పది కోట్ల మంది మృత్యువాత పడ్డారు. అందువల్లే ఈ సంవత్సరాన్ని విషాధనామ సంవత్సరంగా ఆ నాడు అభివర్ణించారు. ప్రపంచ వ్యాప్తంగా పది కోట్ల మంది ప్రాణాలు వదిలితే.. భారత్‌లో కూడా 1.70 కోట్ల మంది మరుభూమికి చేరుకున్నారు. అంటే.. నాటి దేశ జనాభాలో ఈ మృతుల సంఖ్య ఐదు శాతం.


తొలుత స్పెయిన్‌లో కనిపించిన ఈ వైరస్.. ఆ తర్వాత అమెరికాకు చేరింది. ఆరంభంలో ఈ వైరస్‌ను సరిగా గుర్తించలేని వైద్యులు.. డెంగ్యు, కలరా, టైఫాయిడ్‌ జ్వరాలకు కారణమయ్యే వైరస్ అని భావించారు. అయితే, మృతుల సంఖ్యను లెక్కించలేని విధంగా పెరిగి పోవడంతో తేరుకున్న వైద్యులు.. దీనికి హెచ్1ఎన్1ఏ అనే వైరస్‌గా నామకరణం చేశారు. 1918లో ప్రపంచాన్ని శ్మశానవాటికగా మార్చిన ఈ వైరస్‌‌కు మూలకారణం పందులేనని గుర్తించారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు పలు రకాలుగా ఈ వైరస్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తు, వైద్య రంగాన్ని సవాల్ చేస్తోంది. 1918 నుంచి ఇప్పటి వరకు పలు సార్లు వివిధ వైరస్‌ల రూపంలో వ్యాపించాయి. 1918లో స్పానిష్ ఫ్లూ రాగా, 10.30 కోట్ల మంది మృత్యువాత పడ్డారు. 50 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడ్డారు.

1957లో ఏషియన్ ఫ్లూ. పది లక్షల మంది చనిపోయారు. 1968లో హాంకాంగ్ ఫ్లూ, 1976లో యూఎస్ ఫ్లూ, 1977లో రష్యన్ ఫ్లూ, 1990లో సార్స్, 2004లో బర్డ్ ఫ్లూ ఇలా.. పలు రకాల్లో వైరస్ మానవాళిపై దాడి చేసింది. చేస్తూనే వుంది. అయితే, ఈ తరహా వైరస్‌లను అరికట్టడానికి, శాశ్వతంగా నిర్మూలించడంలో వైద్య పరిశోధనా రంగం సరికొత్త సవాళ్ళను ఎదుర్కోంటోంది.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
సూపర్ నోవా తొలి చిత్రాన్ని కనుగొన్న శాస్త్రవేత్తలు
స్వైన్ ఫ్లూ రోగులను పసిగట్టే ధర్మల్ స్కానర్స్
పదవీ గండంలో కేసీఆర్ అటూ ఇటూ...?
తిరుమలేశునికి ఎప్పటికీ ఋణగ్రస్తులమే
ఇది 12వ దాడి: భారతీయులంటే ఎందుకింత ఈర్ష్య...?
అనుభవ రాహిత్యమా?.. చాణక్య తంత్రమా!