ప్రపంచవ్యాప్తంగానెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచంలోని చాలా కంపెనీలు తమ సంస్థలలోనుంచి ఉద్యోగులను వారి ఇండ్లకు పంపేస్తున్నారు. ప్రసుత్తం ఈ ప్రభావం ఎగుమతి రంగంపైనకూడా చూపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మన దేశంలో ఎగుమతి రంగంలో ఈ ఏడాది సుమారు 13 లక్షలకు పైగా ఉద్యోగాలు రద్దయ్యే పరిస్థితి ఉందని యూఎన్‌సీటీఏడీ సంస్థ వెల్లడించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో కొనసాగుతున్న ఆర్థిక సంక్షోభం కొలిక్కిరాక పోవడమే ఇందుకు కారణమని ఆ సంస్థ వివరించింది. యూఎన్‌సీటీఏడీ అధ్యయనం ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మన దేశం నుంచి 2.2 శాతం మేరకు ఎగుమతులు క్షీణించాయని తత్ఫలితంగా ఎగుమతుల రంగంలో 7.48 లక్షల ఉద్యోగాలకు కోత పడనున్నట్లు తెలుస్తోంది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలో పరిస్థితిలో మార్పు రావచ్చని ఎగుమతుల రంగంలో కొత్త ఉద్యోగాలకు ఆస్కారం ఉండొచ్చని ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. |