ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్ > జగన్నాథుని నీడ.. తెరాసకు శాపమా...?
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
జగన్నాథుని నీడ.. తెరాసకు శాపమా...?
FileFILE
తెలంగాణా భవన్‌.. తెలంగాణా రాష్ట్ర సమితి ప్రధాన కార్యాలయం. ఈ భవనాన్ని ప్రస్తుతం వాస్తు దోషం వెంటాడుతోందట. భక్తుల కోర్కెలు తీర్చే ఆ జగన్నాథుని రూపంలో ఈ దోషం ఆవరించి అష్టకష్టాలు పాల్జేస్తోందని వాస్తు పండితులు చెపుతున్నారు. ఈ ఆలయం వెనుక భాగంలో జగన్నాథుని ఆలయం నిర్మితమైవుంది. ఈ ఆలయం నిర్మాణం పునాదుల నిర్మాణం ఆరంభించినప్పటి నుంచి తెరాస పునాదులు కదలడం ఆరంభమయ్యాయని వారు చెపుతున్నారు.

ఈ విషయం నిజమేననేందుకు... గత నాలుగేళ్లలో చోటు చేసుకున్న సంఘటనలు దీనికి మరింత బలం చేకూర్చుతున్నాయి. ఎందుకంటే.. 2001లో ఆవిర్భావమైన తెరాస.. నాలుగేళ్ళ పాటు ఇటు రాష్ట్రం, అటు జాతీయ స్థాయిలో చక్రం తిప్పింది. ఐదు దశాబ్దాలుగా సాగుతున్న తెలంగాణా ఉద్యమానికి కొత్త ఊపు తెచ్చింది. తెలంగాణా ప్రజలను ఏకతాటి పైకి తీసుకొచ్చింది. వారిని చైతన్య పరిచింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను ఎలుగెత్తి చాటడంలో ఆ పార్టీ సారథి కేసీఆర్ సఫలీకృతులయ్యారు.

ఫలితంగా 2004లో జరిగిన అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో తెరాస అనూహ్యమైన ఫలితాలు సాధించింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ "గులాబీ" పరిమళం వికసించింది. అలా.. 2005 సంవత్సరం వరకు రాష్ట్ర రాజకీయాల్లో యమ స్పీడుతో దూసుకెళ్లిన కారుకు ఈ యేడాది ప్రథమార్థంలో బ్రేకులు పడటం ఆరంభించాయి. పార్టీలో కేసీఆర్ ఒంటెద్దు పోకడలు ఎక్కువయ్యాయి. కుటుంబ పాలన మితిమీరింది. ఇష్టానుసారంగా, అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడం ఆరంభమైంది. ముందు వెనుకా ఆలోచించకుండా నోరు జారటం ఎక్కువైంది.

ఇదేసమయంలో అంటే.. 2005 ఆరంభంలో తెలంగాణా భవన్ వెనుక భాగంలో జగన్నాథుడి ఆలయ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కళింగ కల్చరల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ పూజలు జరిగాయి. ఆలయ నిర్మాణం కూడా అపుడే ఆరంభమైంది. అప్పటి నుంచి తెరాసలో ముసలం పుట్టుకొచ్చింది. 2005 వరకు కేసీఆర్‌కు జై కొట్టిన పార్టీ నేతల్లో కొందరు తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. పార్టీలో అసమ్మతి గళం పెరిగింది. ఈ పరిణామాలకు 2005లో జరిగిన విధానమండలి (ఎంఎల్‌సి)కి జరిగిన ఎన్నికలు మరింత ఆజ్యం పోశాయి. 2006 నాటికి ఇవి తారా స్థాయికి చేరాయి.

పార్టీ ఎమ్మెల్యేల్లో చీలిక వచ్చింది. ప్రత్యేక తెలంగాణా సెంటిమెంట్‌ను అడ్డుపెట్టుకుని కేసీఆర్, ఆ పార్టీ మరో సీనియర్ నేత ఆలె.నరేంద్ర తమ కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేశారు. ఆ యేడాది అలా సాగిపోయింది. 2007లో నకిలీ పాస్‌పోర్టుల కేసులోనూ, మనుషుల అక్రమ రవాణా కేసుల్లో కేసీఆర్, నరేంద్రలతో పాటు.. పార్టీ ఎమ్మెల్యేల పేర్లు వినిపించాయి. ముఖ్యంగా, మనుషుల అక్రమ రవాణా కేసును అడ్డుపెట్టుకుని నంబర్-2గా ఉన్న నరేంద్రను పార్టీ నుంచి బహిష్కరించారు.

ఈ నేపథ్యంలో 2008లో జరిగిన ఉప ఎన్నికల్లో కేసీఆర్‌కు తగిన శాస్తే జరిగింది. 18 అసెంబ్లీ స్థానాలకు గాను 16 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెరాస కేవలం సగం స్థానాలను మాత్రమే తిరిగి దక్కించుకుంది. ఇంతలో 2009 సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి. ఈ ఎన్నికల్లో తెరాస చిత్తుగా ఓడిపోయింది. ఎన్నికలకు ముందు కేసీఆర్ నిర్వహించిన మహా చండీయాగం యాగశాలకు నిప్పంటుకుంది. ఇన్ని పరిణామాలు పార్టీలో చోటు చేసుకోవడానికి కేవలం కేసీఆర్ అహంకార ధోరణి అని కొందరు అంటున్నారు.

మరికొందరు మాత్రం.. తెరాస భవన్‌కు వాస్తు దోషం పట్టుకుందని చెపుతున్నారు. అందువల్లే ఇలాంటి అంతర్గత సమస్యలు ఉత్పన్నం కావడం, యాగశాలకు నిప్పంటుకోవడం వంటి సంఘటనలు జరిగినట్టు చెప్పుకొస్తున్నారు. ముఖ్యంగా.. తెరాస భవన్ వెనుక జగన్నాథుని ఆలయ నిర్మాణాన్ని ఆరంభించిన నాటి నుంచే (2005 ప్రథమార్థం) తెరాసకు కష్టకాలం ప్రారంభమైంది. ఈ ఆలయ నిర్మాణం 2009లో పూర్తయింది. ఆలయం పూర్తయి, ఆలయ నీడ తెరాస భవన్‌‌పై పడసాగింది. అప్పటి నుంచి తెరాస కష్టాలు మరింత ఎక్కువయ్యాయి. మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

పార్టీలో తిరుగుబాటు, అసమ్మతి ఎక్కువైంది. గతంలో కేవలం ప్రకటనలకు పరిమితమైన తెరాస అసమ్మతి నేతలు.. ఈ దఫా ఏకంగా తెలంగాణా విమోచన సమితి (టీవీఎస్)ని ఏర్పాటు చేశారు. ఈ సమితికి తెలంగాణా నేతలు, విద్యావంతులు, మేధావులు, ఉద్యమకారులు తమ వంతు మద్దతు ప్రకటించారు. దీంతో దిక్కుతోచని కేసీఆర్ మరోసారి రాజీనామా నాటకాన్ని రక్తికట్టించారు. పార్టీ నాయకత్వం చేసిన ఒత్తిడి మేరకు అధ్యక్ష బాధ్యతలను చేపట్టినట్టు కేసీఆర్ చెప్పుకున్నా.. ఆ పదవిలో కొనసాగడం ఇకపై ఆయనకు ముళ్ళబాటేనని వాస్తు నిపుణులు చెపుతున్నారు.

సాధారణంగా అమ్మవారి గుడి ఎదుట ఉన్న ఇల్లు, విష్ణు ఆలయం పక్కన ఉండే గృహం, ఆలయం నీడ పడే భవనాల ప్రాభవం కోల్పోవాల్సిందేనని వాస్తు పండితులు చెపుతున్నారు. ఇదే నిజమైతే.. తెరాస తెలంగాణా భవన్‌ను మూసి వేయాల్సిందేనా? తెరాస, కేసీఆర్ భవితవ్యం ఏమిటి? అసలు వాస్తు పండితులు చెప్పే మాటల్లో నిజమెంత? ఇత్యాది ప్రశ్నలకు కాలమే సమాధానం చెప్పాలి.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
అంతా భ్రాంతియేనా.. కేసీఆర్ వైఖరి ఇంతేనా!
ప్రజారాజ్యానికి ఆది నుంచి అన్నీ పరీక్షలే
రాహుల్ ! పెళ్ళి చేసుకోండి... తర్వాతే పీఎం అవ్వండి...!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగాలకు గండి
డీజీపీ-ఈసీఓల మధ్య కోల్డ్‌వార్!!
నేతల అసమ్మతి సెగలు: వాడుతున్న కమలం