ప్రధాన పేజి > వార్తలు > వార్తలు > కరెంట్ అఫైర్స్ > వచ్చే జన్మలో మైఖేల్ జాక్సన్ స్త్రీగా పుడతాడట.!
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వచ్చే జన్మలో మైఖేల్ జాక్సన్ స్త్రీగా పుడతాడట.!
DBMG
ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పాప్ సంగీత విద్వన్మణి, డాన్స్ రంగంలో ఓ చరిత్ర సృష్టించిన మైఖేల్ జాక్సన్ మరు జన్మలో స్త్రీగా పుట్టబోతున్నాడట. ఈ విషయం ఆశ్చర్యంగానే ఉంటుంది. కాని ఇది నిజం అంటున్నారు వాల్టర్ సెంక్యూ.

వాల్టర్ అనే వ్యక్తి పునర్జన్మలమీద రీసెర్చ్‌లు చేస్తుంటాడు. ఇతను పునర్జన్మల కాన్సెప్ట్‌తోనే పునర్జన్మపై పుస్తకం రాశాడు. ఇందులో ప్రముఖుల గురించి వివరించియున్నాడు. ముఖ్యంగా మన దేశ మాజీ అధ్యక్షుడు అబ్దుల్ కలామ్ గత జన్మలో టిప్పుసుల్తాన్ అని, అలాగే షారూఖ్ ఖాన్, బిగ్ బీ అమితాబ్ గురించికూడా ఆయన తన పునర్జన్మ పుస్తకంలో వివరించి ఉన్నాడు.

మైఖేల్ జాక్సన్ గురించి వాల్టర్ మాట్లాడుతూ... జాక్సన్ గత జన్మలో చార్లెస్ డెస్కోని అనే ఫ్రెంచ్ దేశానికి చెందిన రాజు అని, అతనికి ప్రపంచమంతా తనగురించి చెప్పుకోవాలనే కోరిక బలీయంగా ఉండేదని, ఆ జన్మలో తన కోరిక తీరకపోవడంతో ఈ జన్మలో మైఖేల్ జాక్సన్‌గా ప్రజల ముందుకు వచ్చి సెలిబ్రిటీగా మారాడని ఆయన అన్నారు.

ఫ్రెంచ్ రాజు చార్లెస్ డెస్కోనీ 16వ శతాబ్దంలో జీవించాడని, ఇరవై ఒకటవ శతాబ్దంలో మైఖేల్ జాక్సన్‌గా అవతరించాడని, త్వరలో స్త్రీగా పుట్టి మరింత ఫాలోయింగ్ సంపాదించుకుంటాడని వాల్టన్ అన్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో మరో పుస్తకం రాయనున్నట్లు ఆయన ప్రకటించారు.
 Play Free Online Games  Click Here
 Blogs, Videos and More  Click Here
 Send Musical and Animated Cards  Click Here
 Simple,Fast & Free Email Service  Click Here
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
మరిన్ని
జాక్సన్ అంటే నాకు ద్వేషం: వర్మ
ప్రశ్నార్థంగా మైఖేల్ పిల్లల భవితవ్యం!
భారత్ ముసలిదైపోతోందా...!
తెదేపాలో తలసాని తుఫానుకు చెక్!
పాప్ కెరటం నేల రాలిపోయింది
"ఆపరేషన్ ఆకర్ష్‌"తో ప్రతిపక్షాలు కుదేల్!