మోహన్ పేరుకు తగ్గట్టే అందంగా, హుందాగానూ ఉంటాడు. తన పని తాను చేసుకుపోయే తత్వంకల బుద్దిమంతుడు. అతడినికాని, అతడి పనినికాని ఏ ఒక్కరుకూడా వేలెత్తి చూపేంతవరకు పెట్టుకోడు.
ఇక్కడి వరకు బాగానే ఉంది. కాని రాత్రి అయ్యేసరికి అతనిలోని ఓ అపరిచితుడు నిద్ర లేస్తాడు. అతనిలో ఎవరికీ తెలియని ఇంకో మనిషి దాగున్నాడు. అలాగని మద్యం సేవించడమో లేదా ధూమపానం చేయడమో లేదా గుట్కాలు తీసుకుంటాడునుకుంటే పొరపాటే. అతనికి అలాంటి దురలవాట్లు లేవు.
కాని అతనికి నచ్చిన వారితో ఫ్రెండ్‌షిప్ చేస్తాడు. వాళ్లను ఇంటికి రప్పించుకుంటాడు. వాళ్లకు కావలసినవన్నీ సర్దుబాటు చేస్తాడు. అవసరమైతే డబ్బు సాయం కూడా చేస్తాడు. కాకపోతే వాళ్లతో స్వలింగ సంపర్కం ఏర్పాటు చేసుకుంటాడు.
అందుకు ఒప్పుకోకపోతే... వాళ్లను దూరంగా ఉంచుతాడు. ఒప్పుకుంటే వాళ్లకు ఏం కావాలన్నా చేసిపెడతాడు. ఆ రకంగా అతను పెద్ద వాళ్లు సంపాదించిపెట్టిన ఆస్తిని దాదాపు మొత్తం ఖాళీచేసుకునే స్థాయికి కూడా వచ్చేశాడు. మరిఅతను పెళ్లి చేసుకుంటే ఆ అలవాట్లు మార్చుకుంటాడా అంటే సందేహమేనంటున్నారు మానసిక వైద్య నిపుణులు.
గతంలో ఆడవారి కోసం రాజ్యాలు పోగొట్టుకున్నవాళ్లు ఉన్నారు. ప్రాణాలు పోగొట్టుకున్నవాళ్లు, ఆస్తులు అమ్ముకున్న వాళ్లుకూడా ఉన్నారు. మరి ఇక్కడ దానికి వ్యతిరేకంగా జరుగుతోంది. మగవారి కోసం మగవారే, ఆడవారికోసం ఆడవారే ఇలాంటి పనులు చేస్తున్నారంటే ఆశ్చర్యం కలుగక మానదు. ఇలాంటి వాళ్లు ఉంటారా అని సందేహపడేవాళ్లుకూడా ఉన్నారు.
పైకి వీళ్లు చాలా పెద్దమనుషుల్లాగే ఉంటారు. అయితే వీళ్లు ఎవరిని పడితే వారిని లోబర్చుకోవడానికి ప్రయత్నించరు. కేవలం తమకు నచ్చిన వారినే ఎంచుకుంటారు. వారితో మెల్లగా స్నేహం చేస్తారు.
సమాజంలో అందరితో పాటే జీవిస్తుంటారు. వీళ్లు ఇలాంటివాళ్లనే విషయం ఎవ్వరికీ తెలియనివ్వరు. తమ పని తాము చేసుకుంటూ పోతుంటారు. ఇలాంటివారిని గుర్తించడం చాలా కష్టం అంటున్నారు మానసిక వైద్యనిపుణులు.
కొంత మంది అలా కాదు. వాళ్ల నడక, మాట తీరే వేరుగా ఉంటుంది. మూతిమీద మీసం కూడా రాదు. మొహం కూడా పేడు మొహంలా ఉంటుంది. సాధారణంగా ఇలాంటి వారు ఆడవారి దుస్తులు వేసుకుని తెగ ఆనందపడిపోతుంటారు.
వీలైతే బ్యూటీపార్లర్‌కు వెళ్లి పూర్తిస్థాయి ఆడవారిగా దర్శనమిచ్చేందుకు కూడా వెనుకాడరు. అయితే ఇక్కడ చెప్పుకునే ఈ మగవారు పూర్తి భిన్నంగా వ్యవహరిస్తుంటారు.
ఇది ఓ రకమైన మానసిక రుగ్మత అని మానసిక వైద్య నిపుణులు అంటున్నారు. ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్లకు సాధారణంగా బిహేవియర్ థెరపీ ఇప్పిస్తే చాలావరకు సానుకూల దృక్పథం అలవరచుకుని మారిన సందర్భాలుకూడా ఉన్నాయంటున్నారు వైద్యులు. |