జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » సెప్టెంబర్ 23న ఓషన్‌శాట్-2 ఉపగ్రహ ప్రయోగం (Oceansat 2 | September 23 | satellite launch | ISRO | European technology | PSLV | Sriharikota | Madhavan Nair)
 
చేపల ఉనికి ఉన్న ప్రాంతాలు మరియు తీర ప్రాంతాలను అధ్యయనం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) సెప్టెంబర్ 23న ఓషన్‌శాట్- 2 ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. యూరోపియన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఈ ఉపగ్రహంలో ఉపయోగిస్తున్నారు.

సుమారు 970 కేజీలు గల ఈ అంతరిక్ష నౌక.. స్వంత టెక్నాలజీతో పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్‌వీ) పేరిట తూర్పు తీరం వద్ద ఉన్న శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించనున్నారు. ఈ ఉపగ్రహ ప్రయోగానికి సన్నాహాలు శ్రీహరికోటలో వేగంగా సాగుతున్నాయి.

బెంగుళూరులోని ఇస్రో ప్రధాన కేంద్ర ప్రతినిధి ఎస్ సతీష్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 23న ఉదయం 11.56కు.. లేదా ఇంచుమించు మధ్యాహ్న సమయంలో ప్రయోగించేందుకు షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. అత్యధికంగా చేపల ఉనికి ఉన్న ప్రాంతాల గుర్తింపు, తీర ప్రాంతాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయడం.. వాతావరణ మరియు పర్యారణానికి సంబంధించిన తాజా అధ్యయనం వంటి వాటి కోసం ఈ ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నట్లు తెలిపారు.

1999, మేలో ఇస్రోచే ప్రయోగించబడిన ఓషన్‌శాట్- 1 ప్రత్యామ్నాయంగా దీన్ని ఉపగ్రహ కక్ష్యలోకి ప్రవేశపెట్టనున్నట్లు వివరించారు. సముద్ర అధ్యయనంలోభౌతిక, జీవజాలమునకు సంబంధించి ఓషన్‌శాట్- 1 ద్వారా అధ్యయనం చేశారన్నారు. ఓషన్‌శాట్- 1 ను ప్రయోగించి ఇప్పటికి 10 సంవత్సరాలు పూర్తయింది.

దీని నుంచి సేకరించిన సమాచారం మత్స్యకారులకు విస్తృతంగా ఉపయోగపడిందని ఇస్రో ఛైర్మన్ జీ మాధవన్ నాయర్ తెలిపారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.