జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » జాబిలిపై.. నీటి శోధన తర్వాత, జీవుల మనుగడపై పరిశోధన (Moon | Water | research | Life on moon | Jayanth Narlikar | Earth surface | Astronomist)
Feedback Print Bookmark and Share
 
File
FILE
శాస్త్రవేత్తలు నిర్విరామ కృషికి ఫలితం సాధించారు. చందమామపై కొన్ని ప్రాంతాల్లో నీటి జాడను కనుగొనడంలో సఫలీకృతులయ్యారు. ఇక ముందు.. నీటి తర్వాత మానవ మనుగడకు ఉపకరించే వాతావరణం.. చంద్రునిపై ఎంత వరకు ఉందనే దానిపైనే ప్రస్తుతం.. వీరి పరిశోధనలు కొనసాగనున్నాయి.

చంద్రునిపై ఇటీవలే నీటి జాడ ఉందని తెలుసుకున్నాక.. అక్కడి భూభాగంపై మానవ మనుగడ సాధ్యాసాధ్యాలపై తాజా పరిశోధనలకు తెరలేపనున్నారు. దీనికి సంబంధించి.. గోవాలో 'భూమిపై గల వివిధ వాతావరణాల్లో మానవ మనుగడపై పరిశోధనలు' అనే అంశంపై ఏర్పాటు చేసిన సదస్సులో ప్రముఖ ఖగోళ శాస్త్రవేత్త, పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత జయంత్ నార్లికర్ ప్రసంగించారు.

చంద్రునిపై నీటిని కనుగొన్నాం.. అలాగే అక్కడి మానవ మనుగడపై తదుపరి దృష్టి సారించినట్లు తెలిపారు. అంతకంటే ముందుగా.. భారత్‌లోని అంతరిక్ష పరిశోధనశాలలో కొన్ని ప్రయోగాలు చేశామన్నారు. వాటిల్లో ఒకటి.. భూమి నుంచి 41 కి.మీల దూరంలోను మానిషికి అనువైన వాతావరణం కలిగి ఉండటం.. అక్కడ... భూ ఉపరితలంపై ఇంత వరకు కనుగొనబడని.. సూక్ష్మ జీవులు ఆ వాతావరణంలో జీవిస్తున్నట్లు కనుగొన్నామన్నారు.

అక్కడ జీవిస్తున్న సూక్ష్మజీవులు వాటి జీవన గమనంపై భారత్‌లో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరియు ఇతర ఖగోళ శాస్త్ర పరిశోధన సంస్థలచే ప్రయోగాలు చేశారన్నారు. దీనికి సంబంధించి.. ఇస్రో నేతృత్వంలో.. 2001 మరియు 2005లలో రెండు సార్లు విజయవంతంగా బెలూన్ పరీక్షలు నిర్వహించామన్నారు.

భూఉపరితలం నుంచి 41 కి.మీల దూరం వరకు ఉన్న ఈ బెలూన్ (స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యూబులు)లలోకి గాలిని పంపామన్నారు. 41 కి.మీల పొడవు మేరకు ఇక్కడ నుండి పంపిన గాలి శాంపిళ్లను సేకరించామన్నారు. ఈ గాలి శాంపిళ్లను పరీక్షించామని.. ఇందులో.. భూమిపై ఇప్పటి వరకు కనుగొనని సూక్ష్మ జీవులున్నట్లు రూఢీ అయిందన్నారు.

ఆ జీవులు భూమిపై ఉన్న బ్యాక్టీరియాకు భిన్నంగా ఉన్నాయన్నారు. సూర్యుని నుంచి వెలువడే అతినీల లోహిత కిరణాలను సైతం ఇవి తట్టుకొని ఉంటున్నట్లు కనుగొన్నామన్నారు. దీని ప్రకారం.. చంద్రునిపై కూడా ఇలాంటి పరిశోధనలు అవశ్యమన్నారు. కాగా, ఖగోళ మరియు ఖగోళ భౌతిక శాస్త్ర కోసం ఏర్పాటు చేసిన ఇంటర్ యూనివర్శిటీ కేంద్రానికి వ్యవస్థాపకులు మరియు డైరెక్టర్‌గా నార్లికర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.