జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » వస్తోంది 2వ తేదీ: బెంబేలెత్తుతున్న కర్నూలు జిల్లా (2009 | September 2 | October 2 | YSR Death | Calamity | Floods | Kurnool | AP | Distric)
Feedback Print Bookmark and Share
 
FILE
2009వ సంవత్సరం సెప్టెంబర్ రెండు, అక్టోబర్ రెండవ తేదీల్లో వరుసగా కోలుకోలేని సంఘటనలు రాష్ట్ర ప్రజలను కుదిపేసాయి. ముఖ్యంగా కర్నూలు జిల్లా ప్రజలకైతే మరీనూ. రెండవ తేదీ వస్తోందంటే కర్నూలు జిల్లా ప్రజల్లో గుండెదడ పుట్టిస్తోందనండంలో సందేహం లేదు.

సెప్టెంబర్ 2న రాష్ట్ర ప్రియతమ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి గురై ఆయనతో పాటు మరో నలుగురు అధికారులు మృత్యువాత పడ్డ విషయం విదితమే. అదికూడా కర్నూలు జిల్లాలోని నల్లమల అడవుల్లో పావురాల గుట్టపై కూలింది. నెల రోజులపాటు రాష్ట్రమంతా దానిపైనే చర్చ జరిగింది. ముఖ్యంగా కర్నూలు జిల్లావాసులైతే మరీ ఎక్కువగా చర్చించుకున్నారు.

ఇక అక్టోబర్ 2వ తేదీన ప్రకృతి కోపానికి జిల్లావాసులు బలైపోయారు. గతంలో ఎన్నడూ లేని విధంగా జిల్లాను వరద ముంచెత్తింది. దీంతో జిల్లా కేంద్రమైన కర్నూలు నగరం అతలాకుతలమైంది. వరద కారణంగా జిల్లాలోని ప్రజలు చెట్టుకొకరు పుట్టకొకరు అన్న చందాన ఎత్తైన భవంతులపైకి చేరుకుని తమ ప్రాణాలను కాపాడుకున్నారు. కనీసం దసరా, దీపావళి పండుగలను జరుపుకోలేదు సరికదా తినడానికి తిండి, త్రాగడానికి నీరు కూడా కరువైంది.
FILE


రెండు ప్రమాదాలు ప్రకృతి విపత్తే అయినా రెండవ తేదీ వస్తోందంటే కర్నూలు జిల్లా ప్రజల్లో ఆందోళన మొదలైంది. వచ్చే నవంబర్ 2వ తేదీ ఏ ఉపద్రవం ఉద్భవిస్తుందోనని కలవరపడుతున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.