జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » కాంగ్రెస్-ప్రరాపాల మధ్య జోరుగా "విలీన" మంతనాలు! (Botsa | Allu | KVP | five star hotel | Chiru | Rosaiah | PRP | Congress)
Feedback Print Bookmark and Share
 
File
FILE
కాంగ్రెస్, ప్రజారాజ్యం పార్టీలకు చెందిన అగ్రనేతల మధ్య జోరుగా రహస్య మంతనాలు జరుగుతున్నాయి. ఓబుళాపురం మైనింగ్ అక్రమాలను ప్రధానాంశంగా చేసుకుని ప్రరాపా అధినేత చిరంజీవి ముఖ్యమంత్రి కె.రోశయ్యతో సమావేశమయ్యారు. అలాగే, రాజధానిలోని నక్షత్రాల హోటల‌్‌లో జరిగిన బ్యాంకు సదస్సును అడ్డుపెట్టుకుని మంత్రి బొత్సా సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కేవీపీ.రామచంద్రరావు, ప్రరాపా నేత అల్లు అరవింద్‌లు భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ముఖ్యమంత్రి వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల ఫలితంగా ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్‌ పార్టీలో విలీనం చేసే దిశగా అడుగులు వేస్తున్నట్టు జోరుగానే ఊహాగానాలు వచ్చాయి. వీటికి మరింత బలం చేకూర్చే విధంగానే ప్రరాపా నేతల వ్యవహారశైలి కూడా ఉంది. ఫలితంగా కాంగ్రెస్‌లో ప్రరాపా విలీనం తథ్యమనే ఊహాగానాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో.. ముఖ్యమంత్రి రోశయ్యతో చిరంజీవి, బొత్స, డాక్టర్ కేవీపీలతో అల్లు అరవింద్ భేటీ కావడం వెనుక ఆంతర్యమేమిటనే అంశంపై రాజకీయ వర్గాలు చర్చంచుకుంటున్నాయి.

ఓబుళాపురం మైనింగ్ అక్రమాలపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన అఖిలపక్ష సమావేశానికి ప్రజారాజ్యం పార్టీ నేతలు గైర్హాజరయ్యారు. అయితే ఇదే అంశంపై చిరంజీవి ముఖ్యమంత్రి రోశయ్యను కలిసి వినతి పత్రం సమర్పించారు. మైనింగ్ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య సుమారు అర్థగంట పాటు చర్చలు సాగాయి. ఆ సమయంలో వీరిద్దరు ఏం మాట్లాడుకున్నారన్నది మూడో వ్యక్తికి తెలియడం లేదు.

ఇదిలావుండగా, రాజధానిలోని ఒక నక్షత్ర హోటల్‌లో బ్యాంకు సందస్సు శుక్రవారం జరిగింది. దీనికి హాజరైన అల్లు అరవింద్, బొత్స సత్యనారాయణ, డాక్టర్ కేవీపీలు మాత్రం రహస్యంగా సమావేశమై చర్చలు జరిపారు. అటు చిరంజీవి సీఎంతోనూ, ఇటు అల్లు అరవింద్ మంత్రి బొత్స, ప్రభుత్వ సలహాదారు, జగన్ వర్గానికి మార్గదర్శి కెవీపీతో భేటీ కావడం వెనుక ఆంతర్యమేమిటనే ప్రశ్న తలెత్తింది. దీనిపై మంత్రి బొత్స స్పందిస్తూ.. ఇది యాదృచ్ఛికంగా ఈ సమావేశం జరిగిందన్నారు.

తమ మధ్య ఎలాంటి రాజకీయ అంశాలు ప్రస్తావనకు రాలేదన్నారు. కానీ.. రాజకీయ పరిశీలకులు మాత్రం కొత్త భాష్యం చెపుతున్నారు. ప్రరాపాను విలీనం చెసి జగన్ వర్గానికి చెక్ పెట్టాలన్నదే ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ చీఫ్ డీఎస్‌ల వ్యూహంగా ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తోందని అంటున్నారు. మొత్తం మీద మార్పు నినాదంతో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి చివరికి తన మనస్సును మార్చుకుని కాంగ్రెస్ చెంతకు చేరబోతున్నారన్నది రాష్ట్ర రాజకీయ వర్గాలు సమాచారం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.