జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » టి జేఏసి వంటా వార్పు... సీమాంధ్ర జేఏసీ పాదయాత్ర (Srikrishna committee | Telangana | Seemandhra | JAC)
Bookmark and Share Feedback Print
 
కేంద్ర ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిన దగ్గర్నుంచి తెలంగాణా, సీమాంధ్రల్లో ఆందోళనల పర్వం ఊపందుకున్నది. కమిటీలో తెలంగాణా గురించిన అంశమే లేదని తెలంగాణావాదులు ఆరోపిస్తుంటే... అసలు సమైక్యంగా ఉండాలని రాష్ట్రంలోని అధిక శాతం ప్రజలు చెపుతుంటే కమిటీ ఎందుకని సీమాంధ్ర నాయకులు ప్రశ్నిస్తున్నారు.

శుక్రవారం తెలంగాణా జేఏసీ నాయకులు హైదరాబాదులోని ఎల్బీనగర్‌లో మానవహారాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా టీజేఏసీ కన్వీనర్ మాట్లాడుతూ... అసలు కమిటీలతో తెలంగాణా వచ్చే అవకాశం లేదని కొట్టి పారేశారు. ఇటువంటి కమిటీలు 1969 నుంచి మొన్నటి రోశయ్య కమిటీ వరకూ ఎన్నో వచ్చాయని, కానీ ఏ కమిటీ కూడా తెలంగాణా ఏర్పాటుకోసం చొరవ చూపిన దాఖలాలు లేవని అన్నారు. కనుక కమిటీల వ్యవహారాన్ని ప్రక్కనపెట్టి నేరుగా పార్లమెంటులో తెలంగాణా బిల్లు పెట్టడం ద్వారా తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు ప్రక్రియ మొదలుపెట్టాలని డిమాండ్ చేశారు.

మరోవైపు సీమాంధ్ర నాయకులు మాత్రం.... కమిటీల పేరుతో రాష్ట్రాన్ని విభజన చేయాలని చూస్తే సహించబోమని హెచ్చరిస్తున్నారు. రాష్ట్రంలో అధికశాతం ప్రజలు కలిసి ఉందామని చెపుతున్నారనీ, తెలంగాణాలో కొందరు నాయకులు తమ స్వార్థ ప్రయోజనాలకోసం రాష్ట్ర విభజన వ్యవహారాన్ని తెరపైకి తెచ్చి అశాంతిని రేకెత్తించారని మండిపడుతున్నారు.

విభజన వల్ల జరిగే నష్టాలను రాష్ట్రంలో నలుమూలల పర్యటించి చెప్పేందుకు తాము ప్రణాళికలు రూపొందించుకున్నామనీ, ఆ దిశగా రాష్ట్ర వ్యాప్తంగా తాము పాదయాత్రలు చేయబోతున్నట్లు సీమాంధ్ర నాయకులు ప్రకటించారు. అయితే సీమాంధ్ర నాయకులు తమ తమ పాదయాత్రలను సీమాంధ్రలోనే చేసుకోవాలనీ, తెలంగాణాకు వస్తే పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్నదని తెలంగాణా ప్రాంత కాంగ్రెస్ నాయకుడు దామోదర్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఎవరెన్ని చెప్పినా తాము రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్రలు చేసి తీరుతామని సీమాంధ్ర నాయకులు అంటున్నారు. మరి ఈ పాదయాత్రలు తెలంగాణాలో ప్రారంభమైతే పరిస్థితి ఎలా ఉంటుందో వేచి చూడాల్సిందే!!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.