జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | వైఎస్సార్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » గురువుపై కుళ్లుజోకులు మొట్టికాయలు.. ఇదేనా గురుపూజ (Teachers Day, God, Students, Relations)
Bookmark and Share Feedback Print
 
గురు బ్రహ్మ, గురు విష్ణు
గురు దేవో మహేశ్వరః
గురు సాక్షాత్ పరబ్రహ్మ
తస్మై శ్రీ గురవే నమః

ఈ రోజు మనం అందరం ఈ స్థాయిలో ఉన్నామంటే మన వెనుక ఎవరో ఒకరి ప్రోత్సాహం, ప్రోద్బలం, మార్గదర్శకం ఉండే ఉంటుంది. ఆ శక్తే గురువు. ప్రతి మనిషికి తొలి గురువు తల్లి. తర్వాత గరువును మనం ప్రత్యక్షంగా చూడగలిగేది పాఠశాలలోనే. ఇక్కడి నుంచే మన జీవితం ప్రారంభం అవుతుంది. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటాం. సమాజంలో ఎలా బ్రతకాలో తెలుసుకుంటాం. పాఠశాల జీవితం తర్వాత మన జీవితంలో చాలామంది గరువులు ప్రత్యక్షమవుతారు.

మంచి పుస్తకం ఓ గురువు, మంచి స్నేహితుడు ఓ గురువు, మన తెలివితేటలు ఓ గురువు, మన మంచితనం ఓ గురువు ఇలా ఏదో ఒక రూపంలో మనకు వెన్నదన్నుగా నిలిచి ఇది మంచి, ఇది చెడు అని తెలియజెప్పే ప్రతి అంశం కూడా గురువే...!

గురు-శిష్య సంబంధం గురించే వేరే చెప్పనక్కరలేదు. ఇందుకు చిన్న ఉదాహరణ ఏంటంటే శిష్యుడు మట్టిలో దొరికే బంగారు ముద్ద అయితే.. దానిని ఓ అద్భుత శిల్పంగా మలిచేవారు గురువు. ఇందులో ఎంతో శ్రమ ఎంతో నైపుణ్యం ప్రదర్శిస్తే కాని ఓ అందమైన శిల్పం తయారవదు. అలా తయారయిన శిల్పమే మనం.

ఇపుడు ఆ సంబంధాలు దారి మళ్లుతున్నాయి. గాడి తప్పి అడ్డదారులు తొక్కుతున్నాయి. గత కొద్ది సంవత్సరాల నుంచి జరుగుతూ వస్తున్న సంఘటనలు చూస్తే మనకే అర్ధం అవుతుంది. ఇలాంటి సమాజంలో ఉన్నామా అని బాధ పడవలసిన పరిస్థితి. ఎంత పాశ్చాత్య సాంప్రదాయలను స్వాగతించినప్పటికీ మన మాతృదేశ సాంప్రదాయాలు మరచిపోతే ఎలా..!? మన భారత దేశంలో ప్రాచీన కాలం నుంచి గురువుకు అగ్రస్థానాన్ని ఇస్తూ వచ్చారు పూర్వీకులు.

తల్లి, తండ్రి, గురువు, దైవం అన్నారు పెద్దలు. ఇక్కడ గమనించారా..! ఈ సృష్టికే మూలకారణమైన భగవంతుడికి సైతం నాల్గవ స్థానాన్ని ఇచ్చారు పెద్దలు. అంటే గురువు భగంవంతుడి కన్నా గొప్పవాడని అర్ధం. అసలు ఆయనే లేకుంటే మనం భగవంతుడి గురించి మాత్రం ఏం తెలుసుకోగలం. విద్యాబుద్ధులు చెప్పి మనల్ని భావితరాలకు ఆదర్శంగా నిలిపే గురువుపై కుళ్లు జోకులు వేసి నవ్వుకుంటున్నాం. ఇదేనా మనం నేర్చుకునే విద్య, ఇంతేనా.. మన తెలివితేటలు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.