జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | రౌండప్ 2010 | వైఎస్సార్ | జగన్ మోహన్ రెడ్డి
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » చిరంజీవి టీవీ ఛానల్: అటు పొలిటిక్స్‌కు ఇటు సినీ రీ-ఎంట్రీకి బూస్ట్ (Chiranjeevi | TV Channel | Politics | Congress | Andhrapradesh news)
FILE
చిరంజీవి సినిమా వైపు మొగ్గుతారా...? రాజకీయాల్లో పూర్తిస్థాయిలో కూరుకుపోతారా..? అన్నది ఫిలింనగర్‌లో హాట్‌గాపిక్‌గా ఉంది. ఎక్కువంది ఛానల్‌ పెట్టనున్నట్లు చెప్పకుంటున్నారు. మెగాస్టార్‌ చిరంజీవి ఇప్పుడు మీడియాపై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది. సినిమా ఇండస్ట్రీలో రారాజుగా వెలిగిన ఆయన రాజకీయ పార్టీని పెట్టినప్పుడు తనను మెగాస్టార్‌గా బిరుదు తగిలించిన సినీ జర్నలిస్టుల్ని చులకగా చూశాడన్నది కొంతమంది వాదన. ఆ విషయం ప్రక్కన పెడితే ప్రస్తుతం రాజకీయాల్లో ఆయన పరిస్థితి గందరగోళంగా ఉందని పలు ఛానళ్లు, పత్రికలు ఊకదంపుడు ప్రసారాలు చేస్తూనే ఉన్నాయి. ఈ నేపధ్యంలో చిరు మరోసారి సినిమాలవైపు మొగ్గుచూపాడు.

అమితాబ్‌ బచ్చన్‌ హైదరాబాద్‌కు 'బుడ్డా..' ఫంక్షన్‌కు వచ్చినప్పుడు అరగంటసేపు ఏకాంతగా మాట్లాడాడు. విశ్వసనీయ సమాచారం ప్రకారం రాజకీయాలకు దూరంగా ఉంటేనే బెటర్‌ అనే సందేశాన్ని అమితాబ్‌ ఇచ్చాడని తెలిసింది. ఏది ఏమైనా... మళ్లీ సినిమాల్లోకి రావడం పట్ల తను చేసింది కరెక్టో కాదో.. అన్న విషయాన్ని దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌తోనూ ఆరోగ్య విషయమై పలుకరించినప్పుడు చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం. ఒక అడుగు ఎంతోమంది జీవితాల్ని ప్రభావితం చేస్తున్నట్లు... తను వేసిన వెనుకడగు వల్ల అభిమానుల్ని దూరం చేసుకుంటునన్న ఆవేదన ఆయనలో ఉన్నట్లు భోగట్టా.

కింకర్తవ్యం ఏమిటి?
అటు అభిమానుల నుంచి, సన్నిహితుల నుంచి, ప్రజల నుంచి వస్తున్న తీవ్ర ఒత్తిడిల మధ్య చిరంజీవి తను తర్వాత వేయబోయే అడుగుకోసం పలువురి అభిప్రాయాలను సేకరిస్తున్నాడు. అందులో భాగంగా సినిమా చేస్తే కొన్ని సమస్యలు కుదుటపడతాయని సన్నిహితులు హితవు పలికినట్లు తెలిసింది. అయితే ఇక్కడో సమస్య కూడా ఉంది... ఏదో మమూలు సినిమా చేస్తే పెద్ద స్పందన ఉండదు. కనుక... మంచి సందేశాత్మక చిత్రం చేస్తే బాగుంటుందని కొందరు సూచించారు.

కానీ ఇటువంటి టైమ్‌లో సందేశం చెబితే.. ఠాగూర్‌లా ఉండాలనీ, కానీ.. ఇప్పుడు తానున్న పరిస్థితుల్లో చెబితే వినేవాడు ఉండరనీ... అపహాస్యం అవుతుందని చిరంజీవే చెప్పినట్లు సమాచారం. దాంతో పరుచూరి బ్రదర్స్‌ ఎప్పటినుంచో రాసుకున్న కథను.. ఓ పోరాట యోధుడిని గాథను తెరకెక్కించడానికి సిద్ధమయ్యారు. అందులో భారీ డైలాగ్‌లున్నాయి. అవన్నీ సమాజ శ్రేయస్సుకోసమే ఎక్కువగా పెట్టారు. కొన్ని సన్నివేశాలు, డైలాగ్‌లు కావాలని పెట్టినట్లున్నాయని వాటిని మార్చాలని సూచించారట. అయితే.. తాను చెప్పాలనున్నది ప్రజలకు చేరాలంటే ఓ మీడియా కావాలని యోచించారు. అందుకు అనుగుణంగా ఛానల్‌ ఏర్పాటుకు సిద్ధమైనట్లు ఎప్పటి నుంచో వినపబడుతోంది.

సన్నాహాలు జరుగుతున్నాయి
తనకూ న్యూస్‌ ఛానల్‌ ఉంటేనే తాననుకున్నది చెప్పగలనని అనుకున్న చిరంజీవి దానికి నడుంకట్టాడు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ కూడా తీసుకున్నాడని తెలిసింది. టీవీ9లో పనిచేసి సాక్షిలో పనిచేస్తున్న స్వప్న ఆధ్వర్యంలో ఛానల్‌ బాధ్యతలు చిరంజీవి నిర్వర్తించనున్నట్లు తెలిసింది. ఈ ఛానల్‌కు 'పవర్‌ న్యూస్‌' అనే పేరు రిజిష్టర్‌ అయినట్లు సమాచారం. ఆల్‌రెడీ అల్లు అరవింద్‌ కొడుకు శిరీష్ మార్కెటింగ్‌లో అనుభవం ఉంది. ఓ మ్యాగజైన్‌ కూడా నడుపుతున్నాడు. అటువంటి వారితో కొన్ని బాధ్యతలు నిర్వహించనునట్లు సమాచారం.

మరోవైపు చిన్నకూతురు శ్రీజ, పవన్‌ భార్య రేణుదేశాయ్‌ దగ్గరుండి పర్యవేక్షించనున్నట్లు తెలిసింది. ఇన్ని ఆలోచనలతో ప్రణాళిక సిద్ధం చేస్తున్న చిరంజీవికి.. అంతా తనవారైతే ఇబ్బంది కనుక.. బయట సీనియర్స్‌ను పెట్టాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అల్లు అరవింద్‌ ఇందుకు సంబంధించి ఢిల్లీకి చెందిన ప్రముఖ జర్నలిస్టును అడిగినట్లు సమాచారం. ఏది ఏమైనా త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
సంబంధిత సమాచారం
దీన్ని కూడా శోధించు: చిరంజీవి, టీవీ చానల్, రాజకీయాలు, కాంగ్రెస్, ఆంధ్రప్రదేశ్ వార్తలు