జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | తెలంగాణా రణరంగం | రౌండప్ 2009 | రౌండప్ 2010 | వైఎస్సార్ | జగన్ మోహన్ రెడ్డి
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి : మోకాలడ్డిన సీఎం కిరణ్! (Chiranjeevi | cm Kiran | Bosta Satyanarayana | Cabinet Berth | Tirupati)
stalin
File
FILE
ప్రజారాజ్యం పార్టీ అధినేత, ప్రస్తుత కాంగ్రెస్ నేత, సినీ నటుడు చిరంజీవికి కేంద్ర మంత్రి పదవి రాకుండా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మోకాలడ్డినట్టు వార్తలు వస్తున్నాయి. అందుకే చిరంజీవి కేంద్రమంత్రి అయ్యేందుకు మరికొంతకాలం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

తన ప్రభుత్వానికి ఆపద్బాంధవుడిగా ఉన్న చిరంజీవి పట్ల ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆ విధంగా వ్యవహరించడానికి కారణాలు లేకపోలేదు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు సీఎంకు ఏమాత్రం అనుకూలంగా లేవన్నది జగమెరిగిన సత్యం.

చిరంజీవిని కేంద్ర మంత్రి పదవి చేయాలంటే ఆయనను రాజ్యసభకు పంపాల్సి ఉంటుంది. చిరును రాజ్యసభకు పంపితే ప్రస్తుతం ఆయన శాసనసభ్యుడిగా ప్రాతినిథ్యం వహిస్తున్న తిరుపతి స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంది. ఈ స్థానాన్ని తిరిగి అధికార పార్టీ గెలిపించుకోవాలి.

ప్రస్తుత పరిస్థితిలో తన సొంత జిల్లాలో పార్టీని గెలిపించుకోవడం కిరణ్ కుమార్ రెడ్డికి కత్తిమీదసాము లాంటిదే. ఈ స్థానంలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి బలం గణనీయంగా ఉంది. పైపెచ్చు..చిరంజీవిపై ఉన్న వ్యతిరేకత మరోమారు కాంగ్రెస్‌కు తిరుపతి ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపక పోవచ్చు.

ఇవన్నీ వాస్తవ రూపంలో జరిగి తిరుపతి స్థానంలో పార్టీ తరపు అభ్యర్థి ఓడిపోతే అటు పార్టీతో పాటు.. ఇటు కిరణ్ కుమార్ రెడ్డికి కొత్త సమస్య ఉత్పనమయ్యే అవకాశం ఉన్నదని అనుకుంటున్నట్లు సమాచారం. ఇప్పటికే.. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో సొంత పార్టీ అభ్యర్ధిని గెలిపించుకోలేకపోయారన్న అపకీర్తిని సీఎం మూటగట్టుకుని ఉన్నారు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మరోసారి ధైర్యం చేయడం ప్రమాదమనే అంచనాకు వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి ఇటీవల తన ఢిల్లీ పర్యటనలో చిరంజీవికి కేంద్ర మంత్రి పదవిని ఇచ్చే అంశంలో కాస్త జాప్యం చేయాలని అధిష్టానాన్ని కోరినట్టు తెలుస్తోంది.

ఉప ఎన్నికలు అయిన తర్వాత అయితే తిరుపతి ఉప ఎన్నికలకు కొంత వెసులుబాటు ఉంటుందని కిరణ్‌ భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందువల్ల అప్పటి వరకు ఆగాలని కోరినట్టు సమాచారం. మొత్తం మీద తన ప్రభుత్వాన్ని ఆదుకున్న చిరంజీవికి మొండి చేయి చూపించేందుకు కిరణ్ కుమార్ రెడ్డి నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు.. ఇచ్చిన మాట ప్రకారం చిరంజీవికి కేంద్రమంత్రి పదవి ఇప్పించేందుకు పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నారు. తన ఢిల్లీ పర్యటనలో పార్టీ అధినేత్రి సోనియా, ఆజాద్‌కూ ఆయన తన మనోగతాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. అందువల్ల వచ్చే ఫిబ్రవరిలో చిరంజీవి కేంద్ర మంత్రి పదవిని చేపడుతారంటూ వ్యాఖ్యలు చేశారు. ప్రరాపా ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇవ్వక పోయినా చిరంజీకి కేంద్ర మంత్రిపదవి ఇతరులను బుజ్జగించాలన్నది బొత్స వ్యూహంగా ఉంది.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia