జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » మళ్లీ నిరాశే ... చిరు వర్గం ఆశలపై నీళ్లు చల్లిన ఆజాద్!! (Chiranjeevi | Azad | Cabinet | Congress | prp | Kiran | no Trust Vote)
ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవితో పాటు ఆయన వర్గానికి చెందిన శాసనసభ్యులతో కాంగ్రెస్ అధిష్టానం బంతాట ఆడుతోంది. ఇదిగో మా మహిమ అంటూ.. మంత్రి పదవుల ఆశచూపి తమలో విలీనం చేసుకున్న తర్వాత తలపండిన కాంగ్రెస్ నేతలు తమ రాజకీయ మార్కుతో చిరంజీవిని ఓ ఆటాడుకుంటున్నారు.

ఇటీవల రైతు సమస్యలపై తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టి అవిశ్వాస తీర్మానం సమయంలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన ప్రరాపా ఎమ్మెల్యేలు ఆ తర్వాత మంత్రి పదవులు దక్కుతాయని భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే, ప్రస్తుతం తద్విరుద్ధమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ప్రరాపాకు చెందిన ఎమ్మెల్యేలకు మాత్రం మంత్రివర్గంలో చోటు కల్పించాలన్న గట్టిపట్టుదలతో హస్తిన పర్యటనకు వెళ్లిన సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి అక్కడ చుక్కెదురైనట్టు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాం నబీ ఆజాద్ మాటలతో తేటతెల్లమైంది. ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ ఉండబోదని ఆయన తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలు చిరంజీవి వర్గం ఎమ్మెల్యేల ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యాయి.

అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ తమ పట్ల చిన్నచూపు చూస్తుందన్న భావనకు శుక్రవారం ఢిల్లీలో ఆజాద్ చేసిన వ్యాఖ్యలతో తేటతెల్లమైందని పలువురు ప్రరాపా ఎమ్మెల్యేలు వ్యాఖ్యానిస్తున్నారు. కష్టకాలంలో ప్రభుత్వాన్ని ఆదుకున్నందుకు గాను కాంగ్రెస్ పార్టీ తమను అవమాన పరిచేలా వ్యవహరిస్తోందని వారు వాపోతున్నారు. మొత్తంమీద చిరు వర్గానికి శ్రీఖర నామ సంవత్సరంలో మంత్రి పదవులను అధిష్టించే అదృష్టం లేనట్టేనని చెప్పొచ్చు.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia