జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | రౌండప్ 2009 | రౌండప్ 2010 | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » మణిపూర్ ఎన్నికలు రేపే: కాంగ్రెస్ పార్టీకి పీఠం దక్కుతుందా..?!! (Manipur Elections | January 28 | Congress | 60 Assembly Seats)
Manipur Elections
FILE
మణిపూర్‌లోని మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు శనివారం ఎన్నికలు జరుగనున్నాయి. పదేళ్ల నుంచి మణిపూర్ రాష్ట్రంలో తిష్ట వేసిన హస్తం గుర్తుకు ఈసారి కూడా కలిసి వస్తుందా..? అనే దానిపై భిన్న వాదనలు వినబడుతున్నాయి.

ముఖ్యంగా రాజకీయ అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతూ.. అధికారుల అవినీతితో ఆర్థికంగా దివాళా తీసిన మణిపూర్ గద్దెను కాంగీయులు దక్కించుకోవడం అంత సులభం కాదన్న వాదనలు వినబడుతున్నాయి. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమై కాంగ్రెస్ పార్టీని కూలదోసేందుకు వ్యూహరచన చేస్తున్నప్పటికీ, వారి మధ్య లుకలుకలు నేటి వరకూ పొడసూపుతూనే ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ విజయావకాశాలకు ఢోకా లేదన్నది విశ్లేషకులు వాదన.

ఇక రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యలు చూస్తే.. అక్కడ ప్రభుత్వం ఉన్నదా..? ఉంటే ఏం చేస్తోందీ..? అనే అనుమానాలు తలెత్తక మానవు. ఈ రాష్ట్రంలో అధికారుల అవినీతి తారాస్థాయికి చేరడంతో ఆర్థికంగా దివాళా అంచున చేరింది. ఆ మధ్య జరిగిన ఘర్షణల కారణంగా సుమారు మూడు నెలలపాటు రాష్ట్రం దిగ్భందనానికి గురైంది. ఆ ప్రత్యేక పరిస్థితుల్లో వంట గ్యాస్ ధర రూ. 2 వేలు, కోడిగుడ్డు ఒకటి రూ. 10కి చేరిందంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

అంతేకాదు మణిపూర్‌లో సూర్యాస్తమయం అయిందంటే ఇక వెలుతురు లేనట్టే. ఎందుకంటే అక్కడ విద్యుత్ సంక్షోభం అంతా ఇంతా కాదు. సాయంత్రం 5 గంటలకు పోయిన కరెంటు అదే రోజు రాత్రికి వస్తే ఏదో అద్భుతంగా జరిగినట్లే. ఎందుకంటే అక్కడ 10 గంటలపాటు విద్యుత్ సరఫరా నిలిపివేత సర్వసాధారణం. రాష్ట్ర రాజధాని నుంచి 110 కిలో మీటర్ల పరిధిలో సాయంత్రం 5 గంట కొడితే చాలు... అంతటా జనరేటర్లు మోతెత్తి పోతుంటాయి.

నిజానికి రాష్ట్రానికి 120 మెగావాట్ల విద్యుత్ వాటా ఉన్నప్పటికీ బలహీనమైన విద్యుత్ పరికరాలు, ట్రాన్స్‌ఫార్మర్ల కారణంగా దానిని రాష్ట్రానికి తరలించుకోలేని దుస్థితిలో అక్కడి ప్రభుత్వం ఉన్నది. ఏడాది మొత్తమ్మీద కష్టపడి 90 మెగావాట్లు తరలించుకు వెళ్లడానికే నానా కష్టాలు పడుతుంటారు. ఇలా చెప్పుకుంటే పోతే.. మణిపూర్‌లో లెక్కలేనన్ని సమస్యలు. చెప్పలేనన్న ఇక్కట్లు. వీటి నుంచి బయటపడవేసే నాధుడు ఏ ఒక్క పార్టీలోనైనా ఉన్నారనే నమ్మకం అక్కడి ఓటర్లకు లేనే లేదన్నది నిపుణుల వాదన. ఇటువంటి పరిస్థితుల్లో శనివారం ఆ రాష్ట్రంలో ఎన్నికలు జరుగబోతున్నాయి. మొత్తం 17 లక్షల మంది ఓటర్లు తమ తీర్పును తెలియజేయబోతున్నారు.
సంబంధిత సమాచారం
WebduniaWebdunia