ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌పై ప్రభావం చూపవని ఒకవైపు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ గులాంనబీ ఆజాద్ చెప్పినప్పటికీ పరిస్థితి అలా ఏమీ లేదు. కాంగ్రెస్ పార్టీలో సింహభాగం ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నట్లు సమాచారం. రాబోయే ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమనీ, 2014లో కూడా ఇదే పరిస్థితి పునరావృతమయ్యే అవకాశం ఉన్నదనీ, కనుక జంప్ చేయడమే బెటరనే అభిప్రాయానికి వస్తున్నట్లు సమాచారం. | Congress MLAs fearing about 2014 assembly elections. Are they looking Jagan's YSR congress party?