జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » వైకాపా అభ్యర్థుల మెజార్టీపై పార్టీల్లో విస్తృతంగా చర్చలు! (Ysr Congress | Congress | tdp | Jagan | Mekapati | Votes)
mekapati rajamohan reddy
File
FILE
నెల్లూరు లోక్‌సభ స్థానం నుంచి భవిష్యత్‌లో కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీల తరపున పోటీ చేసేందుకు ఎవరూ సహాసం చేయకపోవచ్చు. దీనికి ప్రధాన కారణం తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేకపాటి రాజమోహన్ రెడ్డికి లభించిన మెజార్టీ ప్రత్యర్థి పార్టీల్లో గుబులు పుట్టిస్తోంది. ఈ ఎన్నికల్లో ఆయన ప్రత్యర్థి టి.సుబ్బిరామి రెడ్డికి రెండు లక్షల లోపు ఓట్లు రాగా, రాజమోహన్ రెడ్డికి మెజార్టీయే 2.91 లక్షల ఓట్లు వచ్చాయి. దీన్ని చూసిన ప్రత్యర్థి పార్టీలు ఔరా అని నోరెళ్లబెడుతున్నారు. ఈ మెజార్టీపై ప్రత్యర్థి పార్టీలు విస్తృతంగా చర్చలు జరుపుతున్నాయి.

అంతేకాకుండా, పారిశ్రామికవేత్త అయిన మేకపాటి రాజమోహన్ రెడ్డి ఆర్థికంగా సంపన్నుడు. ఈ సంపన్నుడిని ఢీకొట్టేందుకు కాంగ్రెస్ మరో కుబేరుడైన సుబ్బిరామిరెడ్డిని రంగంలోకి దించింది. ఇలాంటి సంపన్నుడు (మేకపాటి) స్థానికుడైన టి.సుబ్బిరామి రెడ్డిని ఎదుర్కొని భారీ మెజారిటీ సాధించడమే ఇపుడు పెద్ద చర్చనీయాంశమైంది.

మేకపాటికి వచ్చిన మెజార్టీ నెల్లూరు లోక్‌సభ స్థానం చరిత్రలోనే ఓ రికార్డు. కడప లోక్‌సభ ఉప ఎన్నికల్లో జగన్‌ 5 లక్షలకు పైగా మెజార్టీతో రికార్డు సృష్టించారు. అయితే, మేకపాటి మెజారిటీని దాంతో పోల్చలేమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

తాజాగా జరిగిన ఈ ఉప ఎన్నికలను 2014లో వచ్చే సాధారణ ఎన్నికలకు సెమీ ఫైనల్‌గా భావిస్తున్నారు. ఈ స్థితిలో మేకపాటి మెజారిటీ తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల నాయకులను నిద్రపోనీయడం లేదు. మేకపాటి మెజారిటీని చూస్తే 2014 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మెజారిటీ అధిక లోకసభ స్థానాలను కొల్లగొడుతుందనే అంచనాలు సాగుతున్నాయి.

గత 2009 ఎన్నికల్లో కొద్ది మంది మాత్రమే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లక్ష నుంచి లక్షన్నర ఓట్ల మెజారిటీతో గెలువగా, మరో 11 మంది కాంగ్రెస్ ఎంపీలు మాత్రం బొటాబోటీ మెజారిటీలతో బయటపడ్డారు. అసెంబ్లీ స్థానాల్లో మరోలా ఉన్నాయి. అయితే, ఇపుడు పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రస్తుతం జరిగిన ఉప ఎన్నికల్లో లోక్‌సభకు మాత్రమే కాకుండా అసెంబ్లీ సీట్లలోనూ వైకాపా అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుపొందారు. ఓడిన చోట్ల గట్టి పోటీ ఇచ్చి ద్వితీయ స్థానంలో నిలిచారు.

దీనికి కారణంగా.. వైకాపా కేవలం కాంగ్రెస్ ఓట్లను మాత్రమే కాకుండా తెలుగుదేశం పార్టీ ఓట్లను కూడా కొల్లగొట్టినట్టు తేలింది. వైఎస్సార్ కాంగ్రెస్ ఓట్ల శాతం 46 ఉండగా, కాంగ్రెసు ఓట్ల శాతం 22, తెలుగుదేశం ఓట్ల శాతం 23 ఉంది. సీమాంధ్రలోనే కాకుండా తెలంగాణలో కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ 2014లో తన సత్తా చాటే అవకాశాలున్నట్లు భావిస్తున్నారు.
సంబంధిత సమాచారం
Feedback Print