ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » ఉప రాష్ట్రపతి ఎన్నికలకూ తప్పని పోటీ! (Vice President Poll | Hamid Ansari | Jaswanth Singh | Congress | bjp)
ఉప రాష్ట్రపతి ఎన్నికలకూ తప్పని పోటీ!
సోమవారం, 16 జులై 2012( 13:52 IST )
File
FILE
ఉప రాష్ట్రపతి ఎన్నికకు కూడా పోటీ అనివార్యమైంది. యూపీఏ - ఎన్డీయేలు ఏకాభిప్రాయం, సయోధ్య సాధించడంలో పూర్తిగా విఫలమయ్యాయి. దీంతో ఈ రెండు కూటములు తమతమ అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి.
దీంతో అధికార పక్షం యూపీఏ తరపున ప్రస్తుత ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ పోటీ చేస్తుండగా, ప్రతిపక్ష బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి తరపున జశ్వంత్ సింగ్‌ను కూటమి నేతలు సోమవారం అధికారికంగా ప్రకటించాయి. దీంతో రాష్ట్రపతి ఎన్నికల తరహాలోనే ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరుగనున్నాయి.
అన్సారీ అభ్యర్థిత్వంపై అనేక దఫాలుగా యూపీఏ నేతలు చర్చలు జరిపారు. వివాదరహితుడిగా పేరున్న అన్సారీ పట్ల ఎవరూ పెద్దగా వ్యతిరేకంగా చూపక పోవడంతో ఆయన పేరును కాంగ్రెస్ ఖరారు చేసింది. దీంతో కాంగ్రెస్ అన్సారీకి రెండోసారి ఉపరాష్ట్రపతిగా మరోమారు బాధ్యతలు చేపట్టనున్నారు.
అయితే, గతంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక సందర్భంగా అన్సారీకి వామపక్షాలుమద్దతు పలికాయి. ఈ దఫా మాత్రం ఇంకా తమ వైఖరిని వెల్లడించడం లేదు. కానీ, కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అభ్యర్థిగా ఉంటే తాము మద్దతివ్వబోమని తేల్చి చెప్పాయి.
మరోవైపు.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో జశ్వంత్ సింగ్‌ను బీజేపీ నిలిపింది. తొలుత జేడీయూ అధినేత శరద్ యాదవ్‌ను పోటీకి దించాలని భావించాయి. కానీ, ఆయన పోటీకి నిరాకరించడంతో జశ్వంత్ సింగ్ పేరును ఖరారు చేశాయి. మొత్తంమీద ఉప రాష్ట్రపతి ఎన్నికలు కూడా రాష్ట్రపతి ఎన్నికల తరహాలోనే సాగనున్నాయి.