జాతీయ | అంతర్జాతీయ | ఏపీ న్యూస్ | కరెంట్ అఫైర్స్ | వైఎస్సార్ | కేసీఆర్ | జగన్
ప్రధాన పేజి » వార్తలు » వార్తలు » కరెంట్ అఫైర్స్ » తెలంగాణ వచ్చేస్తోందా...?! అందుకే సీమ నేతలు "గయ్"మంటున్నారా..?!! (Telangana | September | March | kcr | Telugudesam | Congress)
FILE
తెలంగాణ అంశం మరోసారి అగ్గి రాజేసింది. తెలంగాణ, సీమ నాయకుల వ్యాఖ్యలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉద్యమాల బాటకు తెరతీస్తున్నట్లు కనిపిస్తోంది. పార్లమెంటు సమావేశాలకని వెళ్లిన కేసీఆర్ ఢిల్లీలోనే మకాం వేశారు. కేంద్ర కీలక నాయకులు కొంతమంది ఆయన్ను ఢిల్లీలో ఉండాల్సిందిగా చెప్పారనీ, తెలంగాణపై తేల్చేద్దామని చెప్పారని వార్తలు వినబడుతున్నాయి.

ఇదిలావుండగానే చంద్రబాబు నాయుడు తెలంగాణపై మరోసారి పార్టీ అభిప్రాయాన్ని లేఖ ద్వారా తెలియజేద్దామని సీమాంధ్ర నాయకులతో మంతనాలు మొదలెట్టారు. ఈ చర్చల్లో సీమ నాయకులయిన పయ్యావుల కేశవ్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పత్తిపాటి పుల్లారావు తదితరులు లేఖకు వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు సమాచారం. దీంతో చంద్రబాబు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.

తెలుగుదేశంలో తెలంగాణ లొల్లి ఇలావుంటే కాంగ్రెస్ పార్టీలో మరోలా ఉంది. తెలంగాణ ప్రాంత నాయకులు తెలంగాణ వచ్చేస్తోందని చెపుతుంటే.... లగడపాటి రాజగోపాల్ మాత్రం అసలు ఢిల్లీలో ఎలాంటి సంప్రదింపులు జరగడం లేదని తేల్చేశారు. కేసీఆర్ ఢిల్లీలో ఏం చేస్తున్నారో తెలియదనీ, తనకు తెలిసి తెలంగాణపై ఎలాంటి చర్చలు జరగడం లేదన్నారు.

ఇక సీమ నాయకుడు, మంత్రి టీజి వెంకటేష్, దేశంలో వెనకబడిన ప్రాంతం కర్నూలని అన్నారు. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేయాలి తప్పించి ఆ సాకుతో విడదీద్దామంటే కుదరదన్నారు. సీమ ప్రాంత ప్రజలంతా సమైక్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. కేసీఆర్ ఢిల్లీ నుంచి రాగానే తాము ఢిల్లీ వెళ్లి తమ వాదనలను అధిష్టానానికి వినిపిస్తామన్నారు.

ఇక గద్దర్, కేకే లాంటివారు తెలంగాణ సాధనకోసం తెలంగాణ ప్రాంత నాయకులంతా ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. సెప్టెంబరు 30 మార్చ్ లోపు కేంద్రం తెలంగాణపై ఏదయినా చెపుతుందేమో చూడాల్సిందే.
సంబంధిత సమాచారం
Feedback Print