ప్రధాన పేజి   వార్తలు  వార్తలు  అంతర్జాతీయ
 
ఇరాక్ అధ్యక్షుడు జలాల్ తాలాబానీతో బుష్ సమావేశం
ఇరాక్ అధ్యక్షుడు జలాల్ తాలాబానీతో అమెరికా అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యు బుష్ గురువారం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ఇరాక్‌లో శాంతి భద్రతల అంశంపైనే దృష్టి సారించే అవకాశాలున్నాయి.

కాగా ఇరాక్ అధ్యక్షుడు తాలాబానీ వైద్య చికిత్స నిమిత్తం తన అమెరికా పర్యటనను మరిన్ని రోజులు పొడిగించుకున్నారు. ఇలా ఉండగా బుధవారం ఇరాక్ ప్రధాని నౌరీ అల్ మాలికితో బుష్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరాక్‌లో హింసను సమర్థవంతంగా ఎదుర్కొనే అంశంపై చర్చించారు.

రాజకీయ, ఆర్థిక సంస్కరణల ద్వారా ఏ విధానాలు అవలంభించాలనే అంశంపైనే ప్రధానంగా చర్చించినట్లు వైట్ హౌస్ ప్రెస్ కార్యదర్శి టోనీ స్నో చెప్పారు. ఇరాక్‌కు ఎల్లపుడూ అమెరికా మద్దతుంటుందని కూడా స్నో తెలిపారు.
మరిన్ని
ఈ ఏడాది ఆరు లక్షల అమెరికా వీసా అప్లికేషన్లు
పాకిస్థాన్‌లో పరిస్థితులను పరిశీలిస్తున్నాం: అమెరికా
అమెరికా డిప్యూటీ అటార్నీ జనరల్ రాజీనామా
కరాచీ హింసకు వ్యతిరేకంగా నేడు పాక్‌లో సమ్మె
ఇరాక్‌లో ఆత్మాహుతి దాడులు: 26మంది మృతి
అమెరికాలో బెనడిక్ట్ పోప్ ఐదు రోజుల పర్యటన