ఇరాక్‌లో ఉన్న బ్రిటన్ దళాలను ఈ ఏడాది చివరలోపు ఉపసంహరించుకోనున్నట్టు బ్రిటన్ దళాల ఇరాక్ కమాండర్ జొనాధన్ షా తెలిపారు. తీవ్రవాదులు, చొరబాటుదారులు దాడులతో అతలాకుతలం అవుతున్న ఇరాక్ నుంచి తమ భద్రతా దళాలను వెనక్కు తీసుకుంటామని ఆయన స్పష్టంచేశారు.
ఇరాక్‌లో ఉన్న బ్రిటన్ దళాలను ఉపసంహరించుకోడానికి బ్రిటన్ కొత్త ప్రధాని గొర్డాన్ బ్రౌన్ ఆమోదం లభించాల్సి ఉందని తెలిపిన ఆయన, ప్రస్తుతం ఇరాక్‌లో 5,500 మంది తమ సైనిక సిబ్బంది భద్రతను చేపడుతున్నారని చెప్పారు. ఇరాక్ దళాలకు తమ సిబ్బంది గత కొన్నిరోజులుగా శిక్షణ ఇస్తున్నారని గుర్తుచేశారు.
తీవ్రవాదుల దాడులలో తమ దేశానికి చెందిన భద్రతా సిబ్బంది అనేక మంది అశువులుబాసారని ఆవేదన వ్యక్తంచేశారు. బ్రిటన్ కొత్త ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్రౌన్ తొలి సారిగా ఇరాక్ పర్యటనకు రానున్నారని తెలిపారు.
|