ఆఫ్ఘనిస్థాన్‌లోని కొండ ప్రాంతంలో గల మదర్సాలో సంభవించిన బాంబు పేలుడుతో 30 మంది అనుమానిత తీవ్రవాదులు హతమయ్యారు. ఈ బాంబు పేలుడుకు కారణం క్షిపణి అని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదిలా ఉండగా దాడి జరిగిన విధానంపై భిన్నమైన కథనాలు వెలుగు చూసినట్లు స్థానిక పత్రికలు ఉటంకించాయి.
ఈ విషయంమై ఓ అధికారి మాట్లాడుతూ ఉత్తర వజిరిస్థాన్‌లోని దత్తఖిల్ ప్రాంతానికి దక్షిణంగా గల చిన్నపాటి గ్రామం వైపు నుంచి మదర్సా మీదకు క్షిపణులు ద్వారా దాడి జరిగిందని వివరించారు.
మదర్సాలోని దాదాపు 50 మంది విద్యార్థులు ఈ దాడి వల్ల మరణించారని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా క్షిపణి దాడి జరిగిన మాట వాస్తవమేనని, అయితే దాడి లక్ష్యం మాత్రం తీవ్రవాదుల స్థావరమే కానీ మదర్సా కాదని మరో రక్షణ అధికారి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
|