బ్రిటీష్ ప్రధానమంత్రి టోనీ బ్లెయిర్ తన పదవికి బుధవారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను బ్రిటీష్ రాణి ఎలిజబెత్-IIకు ఆయన అందజేశారు. దీంతో పదేళ్ళ బ్లెయిర్ పాలనకు ముగిసింది. అంతకుముందు.. బ్రిటీషన్ పార్లమెంట్‌ను (హౌస్ ఆఫ్ కమ్మన్స్)ను ఉద్ధేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా పలువులు సభ్యులు వేసిన ప్రశ్నలకు బ్లెయిర్ సమాధానం ఇచ్చారు.
అనంతరం బ్రిటీష్ రాణి నివాసమైన బెకింగ్ హ్యామ్‌కు తన భార్యా పిల్లలు, కాబోయే ప్రధాని గార్డన్ బ్రౌన్‌తో వెళ్లి, రాజీనామా లేఖను సమర్పించారు. ఇరాక్ యుద్ధంలో బ్లెయిర్‌పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెల్సిందే. బ్లెయిర్ స్థానంలో గార్డన్ బ్రౌన్ ప్రధానమంత్రి బాధ్యతలను చేపట్టనున్నారు.
|