ప్రధాన పేజి   వార్తలు  వార్తలు  అంతర్జాతీయ
 
రావల్పిండిలో ముషారఫ్ విమానంపై రాకెట్ దాడి
పాకిస్థాన్ అధ్యక్షుడు, సర్వసైన్యాధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ ప్రయాణిస్తున్న విమానంపై రాకెట్ దాడి శుక్రవారం జరిగింది. రావల్పిండిలో ముషారఫ్ విమానం గగనతలంలో పయనిస్తుండగా ఈ దాడి చోటుచేసుకుందని పాక్ మీడియా వెల్లడించింది.

దాడి జరిగిన తర్వాత ముషారఫ్ విమానాన్ని బెలూచిస్థాన్‌లోని తుర్బాట్‌లో దించివేశారు. ఆయన విమాన మీదకు 14.5 ఎం.ఎం సైజు బుల్లెట్లను విద్రోహులు దాదాపు 25 సార్లు పేల్చారని పాక్ అధికారులు మరో కథనం చెబుతున్నారు.

అయితే ఆయన ఈ దాడి నుంచి సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. రావల్పిండిలోని అస్గర్ మాల్ రోడ్డు నుంచి ఈ రాకెట్ దాడి జరిగిందని పాక్‌కు చెందిన డాన్ వార్తా ఛానెల్ వెల్లడించింది. ఈ దాడి జరిగిన వెంటనే పాక్ భద్రతా దళాలు దాడికి పాల్పడిన వారికోసం గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఇంతకుముందు 2003 సంవత్సరంలో కూడా ముషారఫ్ మీద దాడి జరిగిన సంగతి విదితమే.
మరిన్ని
చైనాలో పేలుడు: 25మంది దుర్మరణం
కొత్త పాలస్తీనా ప్రభుత్వానికి ఇజ్రాయెల్ నిధుల బదిలీ
గాంధీజీ లేఖ వేలం పాటను నిలిపేసిన క్రిస్టీస్
పాక్ సీఈసీ వ్యాఖ్యలపై మండిపడిన మంత్రులు
హాంకాంగ్ విముక్తికి పదేళ్లు పూర్తి
ముషారఫ్‌కు వ్యతిరేకంగా పాక్ ఈసీ వ్యాఖ్యలు