ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
 
బర్మాపై ఆంక్షలు విధించిన అమెరికా
ప్రజలపై నిరంకుశంగా వ్యవహరించిన బర్మా సైనిక ప్రభుత్వంపై అమెరికా ఆంక్షలు విధించింది. బర్మా ఆపధ్ధర్మ ప్రధాని, రక్షణ శాఖమంత్రి మరియు సైనిక కమాండర్‌లతో పాటు 14 మంది బర్మా సీనియర్ అధికారులపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రజాస్వామ్యం కోసం ఉద్యమిస్తున్న బర్మా ప్రజలకు మద్దతు తెలుపవలసిందిగా భారత్ మరియు చైనా దేశాలకు అమెరికా విజ్ఞప్తి చేసింది.

మియన్మార్‌లో 11 మంది హత్య గావించబడటంతో అమెరికా పై చర్యలను తీసుకుంది. ఇదిలా ఉండగా అమెరికా అధికార ప్రతినిధి టామ్ కాసే మీడియాతో మాట్లాడుతూ హింసాత్మక చర్యలను నిలిపివేసి ప్రజాస్వామ్యానికి మద్దతు పలుకుతున్న నేతలైన ఆంగ్‌సాన్‌సూకీ తదితరులతో చర్చలు జరపాల్సిందిగా బర్మా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసారు.

వైట్‌హౌస్ అధికార ప్రతినిధి డానా పెరీనో అమెరికా అధ్యక్షుడు బుష్ ప్రకటనను ఊటంకిస్తూ బర్మా సైనికులు మరియు పోలీసులు తోటి పౌరులపై బలప్రయోగాన్ని చేయడం మానుకోవాలని పిలుపునిచ్చారు.
మరిన్ని
నేపాల్‌లో రాచరిక వ్యవస్థకు స్వస్తి..!
నామినేషన్ పత్రాలు దాఖలు చేసిన ముషారఫ్
వియాత్నాంలో పెరిగిన మృతుల సంఖ్య
నేడు నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్న ముషారఫ్
వియత్నాంలో కూలిన బ్రిడ్జి: 27 మంది మృతి
2037 నాటికి అంగారకునిపైకి మానవుడు: నాసా