ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
 
మండలిలో సంస్కరణలు చేపట్టాలి: ప్రణబ్
మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా భద్రతామండలిని సంస్కరించాల్సిన అవసరం ఉందని కేంద్ర విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ అన్నారు. ఐక్యరాజ్యసమితి ఆవిర్భవించిన 1940 సంవత్సరం నాటి పరిస్థితులు ప్రస్తుతం లేవని, అందువల్ల నేటి పరిస్థితుల అవసరాల మేరకు ఆయన డిమాండ్‌ చేశారు. ఐరాస సర్వసభ్య సమావేశాలలో పాల్గొన్న ప్రణబ్.. అభివృద్ధిచెందుతున్న దేశాలకు భద్రతామండలిలో తగిన స్థానం కల్పించాలన్నారు.

ప్రస్తుతం భద్రతామండలిలో ఐదు శాశ్వత, పది తాత్కాలిక సభ్యదేశాలున్నాయి. శాశ్వత సభ్యదేశాలకు వీటో అధికారం ఉంది. భారత్‌తో పాటు జపాన్‌, బ్రెజిల్‌, జర్మనీ కూడా శాశ్వత సభ్యత్వాన్ని ఆశిస్తున్నాయి. ఈ నాలుగు దేశాలు కలసి జి-4 కూటమిగా అవతరించి ఇప్పటికే తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రణబ్ కీలక ఉపన్యాసం చేశారు. అంతకుముందు.. అమెరికా అధ్యక్షుడు జార్జిబుష్‌ ప్రారంభోపన్యాసం చేస్తూ.. సమితిలో సంస్కరణల ఆవశ్యకతను నొక్కి వక్కాణించారు. దీనిపై మంత్రి ప్రణబ్‌ ముఖర్జీ హర్షం వ్యక్తం చేశారు.
మరిన్ని
ఉగ్రవాదంపై సమిష్టి పోరులో విఫలం: సోనియా
పాక్ సైనికాధ్యక్షుడిగా ఐఎస్ఐ మాజీ ఛీఫ్!?
పాక్‌లో బాంబు పేలుడు: 15 మంది దుర్మరణం
న్యూయార్క్ చేరుకున్న సోనియా గాంధీ
ఆత్మ ప్రభోధం మేరకే ఆ తీర్పు: రాణా భగవాన్ దాస్
చర్చల ప్రతిపాదనను తోసిపుచ్చిన తాలిబన్లు