తూర్పు పాకిస్థాన్‌లో బస్సును రైలు ఢీకొన్న సంఘటనలో 12మంది మరణించారు. అంతేకాకుండా మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారని పాకిస్థాన్ పోలీసులు తెలియజేశారు. ఈ సంఘటన లాహోర్ సిటీకి సమీపంలోని మురీద్కీ ప్రాంతంలో సంభవించిందని వారు వెల్లడించారు.
రైల్వే ట్రాక్‌ను దాటేందుకు ప్రయత్నించిన బస్సుపై వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో ఈ సంఘటన జరిగిందని పోలీసు ఉన్నత అధికారి మహమ్మద్ చెప్పారు. ఈ ప్రమాదంలో తీవ్రగాయాలతో సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన వివరాలందించారని తెలిపారు.
వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. ఈ విషయమై బస్సు డ్రైవర్ వద్ద పోలీసులు విచారణ జరుపుతున్నామని ఆయన అన్నారు. గత 2005 జూలై నెలలో దక్షిణ పాకిస్థాన్‌లో రైళ్లు ఢీకొన్న మరో సంఘటనలో 133 మంది మరణించిన విషయం తెలిసిందే.
|