ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
 
పాక్‌లో బాంబు పేలుడు: 17మంది మృతి
ఈశాన్య పాకిస్థాన్‌, పెషావర్లోని ఓ దుకాణంలో బాంబు పేలిన సంఘటనలో 17మంది బుధవారం మరణించారు. మంగళవారం జరిగిన ఈ బాంబు పేలుడు సంఘటనలో మరికొందరు తీవ్రంగా గాయాలకు గురైనట్లు పెషావర్ పోలీసులు తెలిపారు.

పెషావర్ సిటీలోని ముసాఫర్ సీడీ సెంటర్లో ఈ సంఘటన జరిగిందని పెషావర్ పోలీసు ఉన్నతాధికారి అబ్దుల్ మజీద్ తెలియజేశారు. ఇస్లాం మతానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నందుకు తాలిబాన్ తీవ్రవాద సంస్థకు చెందిన తీవ్రవాదులు బాంబు పేలుడు సంఘటనకు పాల్పడ్డారని వారు తెలిపారు. అంతేకాకుండా ఇస్లాం మతానికి విరుద్ధమైన చర్యలను వెంటనే నిలిపివేయాలని తాలిబన్ సంస్థ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
మరిన్ని
బస్సును ఢీ కొన్న రైలు: 12మంది మృతి
నవంబరులో షరీఫ్ స్వదేశీ ఆగమనం
పాక్ సైనికుల దాడిలో 195 మంది మిలిటెంట్ల హతం
బుధవారం కోచి చేరనున్న జపాన్ "పీస్ బోట్"
మృత్యువును మోసగించిన ముషారఫ్
పాక్‌లో డిసెంబర్ 27, 28 సాధారణ ఎన్నికలు?