ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
 
ఆప్ఘన్ సరిహద్దుల్లో అల్‌ఖైదా చర్యలు తీవ్రతరం
పాక్‌- ఆప్ఘన్ సరిహద్దుల్లో అల్‌ఖైదా తీవ్రవాద చర్యలు తీవ్రతరం అవుతున్నాయని యూఎస్ పేర్కొంది. అల్‌ఖైదా పాక్ సహకారంతో తీవ్రవాద చర్యలకు పాల్పడుతోందని యూఎస్ ఆరోపించింది. ఆప్ఘన్ సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాలతో కలిసి అల్‌ఖైదా పన్నాగాలను తీవ్రతరం చేస్తోందని యూఎస్ వ్యాఖ్యానించింది.

దీనితో పాటు దుర్ఘటనలు పెద్ద ఎత్తున పెరిగిపోతున్నాయని యూఎస్ తెలిపింది. ఇస్లామాబాద్ తీవ్రవాద చర్యలకు అతీతంగా యుద్ధం చేపట్టాలని యూఎస్ వైట్ హౌస్ అధికారిక వర్గాలు గుర్తు చేశాయి.

తాలిబన్, అల్‌ఖైదా చర్యలతో ప్రాణ నష్టం పెద్ద ఎత్తున తటస్థిస్తుందని ఈ చర్యను అదుపులోకి తీసుకునేందుకు సన్నాహాలు చేయాల్సిందిగా పేర్కొంది. పాకిస్థాన్ ఆప్ఘన్ సరిహద్దుల్లోని గిరిజనులతో శాంతియుత ఒప్పందం కుదుర్చుకునే అంశంలో విఫలమయిందని యూఎస్ వైట్ హౌస్ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
మరిన్ని
వచ్చే ఏడాది అక్టోబర్‌లో బంగ్లా పార్లమెంట్ ఎన్నికలు
పాక్‌లో బాంబు పేలుడు: 17మంది మృతి
బస్సును ఢీ కొన్న రైలు: 12మంది మృతి
నవంబరులో షరీఫ్ స్వదేశీ ఆగమనం
పాక్ సైనికుల దాడిలో 195 మంది మిలిటెంట్ల హతం
బుధవారం కోచి చేరనున్న జపాన్ "పీస్ బోట్"