ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
 
జనవరిలో సార్వత్రిక ఎన్నికలు: పాక్ ప్రధాని
వచ్చే సంవత్సరం జనవరి ప్రథమార్ధంలో పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయని పాక్ ప్రధానమంత్రి షౌకత్ అజీజ్ ప్రకటించారు. ఆపద్ధర్మ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించబడతాయని షౌకత్ అజీజ్ తెలిపారు.

జాతీయ పార్లమెంటు మరియు రాష్ట్ర అసెంబ్లీల కాలపరిమితి నవంబర్ 15వ తేదీనాటికి ముగుస్తుందని ఆయన అన్నారు. కాలపరిమితి తీరిన 60 రోజులలోగా ఎన్నికలు నిర్వహించాలని వెల్లడించారు. రాష్ట్రపతి ఎన్నికలు ముగియడంతో తొలి విడత ఎన్నికలు పూర్తయ్యాయని అజీజ్ తెలిపారు.

జనవరిలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా, స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు.
మరిన్ని
జర్మనీ శాస్త్రవేత్తకు నోబెల్ పురస్కారం
ఆప్ఘన్ సరిహద్దుల్లో అల్‌ఖైదా చర్యలు తీవ్రతరం
వచ్చే ఏడాది అక్టోబర్‌లో బంగ్లా పార్లమెంట్ ఎన్నికలు
పాక్‌లో బాంబు పేలుడు: 17మంది మృతి
బస్సును ఢీ కొన్న రైలు: 12మంది మృతి
నవంబరులో షరీఫ్ స్వదేశీ ఆగమనం