భారత్-రష్యా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేసే దిశగా భారత్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రణబ్ ముఖర్జీ రష్యాలో పర్యటించనున్నారు. మూడురోజుల పాటు రష్యాలో పర్యటించనున్న ప్రణబ్ ఇరు దేశాల మధ్య ఆర్థిక, సాంకేతిక, వాణిజ్య రంగాల్లో కుదుర్చుకున్న ఒప్పందంలో సమీక్ష నిర్వహించనున్నారు.
దీనికై గురువారం ప్రణబ్ ముఖర్జీ మాస్కో వెళ్లనున్నారు. గత 2006లో కుదుర్చుకున్న ఒప్పందాలపై ఈ సమీక్షా సమావేశం జరుగనుందని భారత విదేశాంగ అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఈ సమావేశానికి రష్యా ఉప ప్రధాని అలెగ్జాండర్ డి. జకోవ్ హాజరు కానున్నారు. భారత్- రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీ సమావేశంలో పాల్గొనేందుకు ప్రణబ్ ముఖర్జీతో సహా పలువురు భారత ఉన్నతాధికారులు మాస్కో వెళ్లనున్నట్లు భారత విదేశాంగ శాఖ అధికారిక వర్గాలు తెలియజేశాయి.
|