ఆగ్నేయ కొలంబియాలో ఉన్న ఒక బంగారు గనిలో ఆదివారం జరిగిన ప్రమాదంలో 21 మంది దుర్మరణం పాలయ్యారు. కొలంబియా రాజధాని బొగోటాకు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వార్స్ ప్రాంతంలోని బంగారు గనిలో ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో 21 మంది ప్రాణాలు కోల్పోగా మరో 20 మంది తీవ్రంగా గాయపడినట్టు స్థానిక అధికార వర్గాలు పేర్కొన్నాయి. అలాగే గనిలో పని చేస్తున్న అనేక మంది కార్మికులు కనిపించలేదని, అందువల్ల మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని వర్గాలు పేర్కొంటున్నాయి.
|