తనపై జరిగిన దాడి పాకిస్తాన్ ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా ఆ దేశ మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో వ్యాఖ్యానించారు. తన రాక సందర్భంగా గురువారం పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నిర్వహించిన ర్యాలీపై జరిగిన ఆత్మాహుతి దళాల దాడిని ఆమె తీవ్రంగా ఖండించారు. దాడికి పాక్ ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరంలేదని ఆమె పేర్కొన్నారు. దాడి జరిగిన అనంతరం శుక్రవారం సాయంత్రం తన అధికార నివాసమైన బలావాల్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. తనపై జరిగిన హత్యాయత్న దాడి వెనుక ముస్లింల ప్రమేయం లేదని ఆమె అన్నారు.
అయితే.. బాంబు దాడి జరిగే సమయంలో వీధి దీపాలు ఆరిపోవడంపై ఆమె అనుమానాలు వ్యక్తం చేశారు. బాంబు దాడి జరిగిన సమయంలో తాను ప్రయాణించే వాహనంపై కూడా తుపాకీ కాల్పులు జరిగినట్లు ఆమె వెల్లడించారు. అయితే..ప్రాథమిక నివేదిక కోసం వేచిచూస్తున్నట్టు చెప్పారు. ఇదిలావుండగా దాడులు వెనుక అల్ ఖైదా హస్తమున్నట్టు కరాచీ పోలీసులు తమ మధ్యంతర నివేదికలో పేర్కొన్నారు.
|