దేశంలో సుసంపన్నత కోసం త్వరలోనే రాజ్యాంగ సభ ఎన్నికలు జరగాల్సి ఉందని ప్రధాని గిరిజా ప్రసాద్ కొయిరాలా అభిప్రాయపడ్డారు. సాధ్యమైనంత వరకు త్వరలోనే నేపాల్‌లో ఎన్నికలు జరగగలదని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం, మావోయిస్టుల మధ్య చర్చల్లో ప్రతిష్టంభన నెలకొనడంతో నవంబర్ 11న జరగాల్సిన రాజ్యాంగ సభ ఎన్నికలు నిరవధికంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉండగా హిందువుల ముఖ్య పండుగ అయిన దసరా సందర్భంగా దేశ ప్రజలకు ఆయన ఇచ్చిన సందేశంలో త్వరగా ఎన్నికలు జరపడం ద్వారా దేశంలో ప్రజాస్వామ్య ప్రక్రియ నెలకొల్పే దిశగా సాగుతున్న చర్యలను కొనసాగించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
|