శ్రీలంక సైనిక వైమానిక దళాలకు, ఎల్టీటీఈకి మధ్య జరిగిన వైమానిక దాడిలో నలుగురు సైనిక వీరులు మరణించారు. అంతేకాకుండా ఎంఎల్-24 రకానికి చెందిన రెండు హెలికాఫ్టర్లు దాడుల్లో ధ్వంసమైనట్లు శ్రీలంక సైనిక అధికారులు తెలిపారు. శ్రీలంక అనురాధపుర జిల్లాలో ఈ వైమానిక దాడులు జరిగాయని ఆ వివరాలు వెల్లడించాయి.
ఈ దాడుల్లో మరో ఎనిమిది మంది సైనిక వీరులు గాయాలకు గురైయ్యారని శ్రీలంక ఎయిర్‌ఫోర్స్ సమాచార ప్రతినిధి అజంతా సిల్వ విలేకరులతో వెల్లడించారు. వవునీనియా ప్రాంతంలోని శ్రీలంక సైనిక స్థావరంపై ఈ దాడులు జరిగాయని అజంతా చెప్పారు.
|