ఇస్లామాబాద్, కరాచీ బాంబు పేలుళ్ల వెనుక పోలీకలున్నట్లు పాకిస్థాన్ అంతర్గత శాఖ మంత్రి అహమ్మద్ వెల్లడించారు. ఈ నెల 18వ తేదీ పాక్ మాజీ ప్రధాని బెనజీర్ రాకను వ్యతిరేకించిన తీవ్రవాద సంస్థలు ఆత్మాహుతి పేలుళ్లు సంభవించిన సంగతి తెలిసిందే.
ఈ బాంబు పేలుళ్లపై ఇస్లామాబాద్, కరాచీ ఇంటలిజెన్స్ విభాగం జరిపిన విచారణలో ఇరు బాంబు పేలుళ్ల సంఘటనల వెనుక పోలీకలు ఉన్నట్టు అహమ్మద్ వెల్లడించారు. అంతేకాకుండా ఇస్లామాబాద్, కరాచీ బాంబు పేలుళ్ల వెనుక గల తీవ్రవాద హస్తంపై పాక్ ప్రభుత్వం విచారణ జరుపుతోందని ఆయన చెప్పారు.
పాక్ ప్రభుత్వం కరాచీ బాంబు పేలుళ్లకు సంబంధించి క్షుణ్ణంగా పరిశీలిస్తోందని అహమ్మద్ అన్నారు. అయితే ఈ బాంబు పేలుడు ఘటనలకు సంబంధించి బాధ్యతరహితమైన వ్యాఖ్యలు, అనవసరమైన ప్రకటనలో విచారణలో మరింత జాప్యమయ్యే ప్రమాదముందని ఆయన పేర్కొన్నారు.
|