బలుచిస్థాన్‌లో గిరిజనుల చొరబాటును అణచివేసేందుకు తాలిబాన్ అనుబంధిత ఇస్లామిక్ గ్రూపులకు పాకిస్థాన్ ప్రభుత్వం మద్దతును ఇస్తున్నదని ఇంటర్నేషనల్ క్రైసైస్ గ్రూప్ (ఐసీజీ) ఆరోపించింది. ఇటీవల ఐసీజీ వెలువరించిన "పాకిస్థాన్: ది ఫర్‌గటెన్ కాన్‌ఫ్లిక్ట్ ఇన్ బలుచిస్థాన్" అనే నివేదికలో పలు ఆసక్తికరమైన అంశాలను చేర్చింది.
విభజించు పాలించు దోరణిని అవలంబించడం ద్వారా ముషారఫ్ ప్రభుత్వం ఆఫ్ఘాన్ తాలిబన్లకు కీలకమైన పస్తూన్ ఇస్లాం పక్షాలకు మద్దతునిస్తూ, పనిలోపనిగా లౌకిక బాలోచ్ మరియు మితవాద పస్తూన్ దళాలను అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నదని పేర్కొంది.
తమ ప్రాంతానికి స్వేచ్ఛతో పాటు తమ ప్రాంతంలోని ఘనమైన వనరులు తమకే దక్కాలని డిమాండ్ చేస్తూ బలోచ్‌లు గత మూడు సంవత్సరాలుగా పోరాడుతున్న సంగతి తెలిసిందే.
|