ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
 
బ్రిటన్‌ బాలలకు న్యాయాధికారాలు
తోటి బాలలు చేసిన తప్పులకు శిక్షలు విధించేందుకుగాను పదేళ్ళ బాలలకు ప్రత్యేక న్యాయాధికారాలను బ్రిటన్ ప్రభుత్వం అందచేసింది. న్యాయచరిత్రలో తొలి సారిగా ప్రిస్టెన్‌లో ఏర్పాటు చేసిన బాలల న్యాయస్థానం తన కార్యకలాపాలను ప్రారంభించిన తొలి సంవత్సరంలో 300 మంది బాలనేరస్థులకు శిక్షించింది.

2009 నాటికి 500 మంది బాలనేరస్థులను శిక్షించే దిశగా బాలల న్యాయస్థానం మౌలిక సదుపాయాలను సమకూర్చుకున్నది. అసాంఘిక కార్యకలాపాలు, విధ్వంసం, గ్రాఫిటీని వెదజల్లడం మరియు చిన్న వయస్సులోనే మద్యపానం సేవించడం తదితర నేరాలకు పాల్పడే 17 సంవత్సరాల లోపు బాలనేరస్థుల కేసులను బాలల న్యాయస్థానం పరిష్కరిస్తుంది.

పెద్దల పర్యవేక్షణ నామమాత్రంగా ఉండే నలుగురు బాలలు సభ్యులుగా గల ప్యానెల్ కేసులపై విచారణ జరుపుతుంది.
మరిన్ని
ఇస్లాం గ్రూపులకు పాక్ మద్దతు:ఐసీజీ
పేలుళ్ల వెనుక పోలికలు: పాక్ ప్రభుత్వం
వైమానిక దాడి: నలుగురు సైనికుల మృతి
త్వరలో నేపాల్‌ ఎన్నికలు: గిరిజా ప్రసాద్
బెదిరింపులు వచ్చినా భయపడేది లేదు: బెనజీర్
డిసెంబర్ 26నుంచి భూటాన్ కౌన్సిల్ ఎన్నికలు