ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
 
ఇరాక్ ఉగ్రవాదులకు లాడెన్ తాజా పిలుపు
అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ అల్ ఖైదా చీఫ్ బిన్ లాడెన్ తాజాగా మరో వీడియో టేపును విడుదల చేశాడు. ఇందులో ఇరాక్‌లోని తీవ్రవాదులంతా ఏకం కావాలని ఆయన పిలువునిచ్చాడు. ఇరాక్‌లో అల్‌ ఖైదాను వ్యతిరేకిస్తున్న సున్నీలంతా తమలో నెలకొన్న విభేదాలను సమసిపోవడానికి ప్రయత్నాలు సాగించాలన్నారు. ఇటీవల కాలంలో ఇరాక్‌లో కొందరు సున్నీ అరబ్‌ గిరిజనులు అమెరికా దళాలతో చేతులు కలిపి అల్‌ ఖైదాపై పోరు సాగించడాన్ని వీడియో టేపులో ప్రస్తావించాడు.

ఇరాక్‌లోని తీవ్రవాదులతో పాటు తీవ్రవాదులు ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చాడు. ఇందుకోసం ముస్లిం ప్రపంచమంతా ఎదురుచూస్తోందని పేర్కొన్నాడు. అల్‌ ఖైదాలో విభేదాల పరిష్కారంలోనూ, గ్రూపులు కట్టకుండా నిరోధించడంలోనూ నన్ను నేను ఎప్పుడూ అప్రమత్తం చేసుకుంటూనే ఉంటాను. ఏ విషయంలోనూ అతిగా పోను. సర్వాధికారాలు తమవే అన్నట్టు నాయకులు ప్రవర్తించకూడదని, మహమ్మద్‌ ప్రవక్త అడుగుజాడల్లోనే నడుచుకోవాలని లాడెన్‌ తాజాగా పిలువునిచ్చాడు.
మరిన్ని
నేడు నెదర్లాండ్ రాణి భారత్ రాక
అణు ఒప్పందంపై అమెరికా ధీమా
మియన్మార్ ఆంక్షలపై థాయ్‌ల్యాండ్ హెచ్చరిక
బ్రిటన్‌ బాలలకు న్యాయాధికారాలు
ఇస్లాం గ్రూపులకు పాక్ మద్దతు:ఐసీజీ
పేలుళ్ల వెనుక పోలికలు: పాక్ ప్రభుత్వం