ప్రధాన పేజి   వార్తలు > వార్తలు > అంతర్జాతీయ
 
భారత్, చైనా ద్వైపాక్షిక సంబంధాలకు చర్యలు
భారత్, చైనా దేశాల మధ్య ఆర్థిక, రక్షణ సంబంధాలను మరింత పటిష్టవంతం చేసేదిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గురువారం భారత విదేశాంగ మంత్రి ప్రణబ్ ముఖర్జీ చైనా విదేశాంగ కార్యదర్శి యంగ్ జితో చర్చలు జరిపినట్లు భారత విదేశాంగ శాఖ అధికారిక వర్గాలు వెల్లడించాయి.

ఇరుదేశాలకు మధ్య ఆర్థిక, రక్షణ సంబంధాలపై ఇరుదేశాలు ఒప్పందం కుదుర్చుకునే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని ఆ వివరాలు తెలియజేశాయి. ఈ విషయమై ప్రణబ్ ముఖర్జీ విలేకరులతో మాట్లాడుతూ... చైనాతో భారత్ సంబంధంపై దేశ ప్రధాని మన్మోహన్ సింగ్ చైనా పర్యటనలో ఆ దేశ ఉన్నతాధికారులతో చర్చలు జరుపనున్నట్లు వెల్లడించారు.

ఈ ఏడాది ఇరుదేశాల మధ్య వాణిజ్యాభివృద్ధికి 350 బిలియన్ డాలర్లను వెచ్చించనున్నట్లు ప్రణబ్ చెప్పారు. గురువారం ఐదు రోజుల పర్యటన నిమిత్తం కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ చైనా రాజధాని బీజింగ్‌కు చేరుకున్నారు. ఆమె ఈ సందర్భంగా చైనా-భారత్ ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపనున్నారని ప్రణబ్ ముఖర్జీ అన్నారు.
మరిన్ని
భారత్‌కు మద్దతుపై ఎటూ తేల్చని రష్యా-చైనా
చంద్రుడిపైకి తొలి ఉపగ్రహం: చైనా ప్రయోగం
ఐదు రోజుల పర్యటన: బీజింగ్ చేరుకున్న సోనియా
నేడు కాలిఫోర్నియాలో జార్జి బుష్ పర్యటన
దాడి సూత్రధారుల పేర్లు వెల్లడించిన భుట్టో
చైనా చేరుకున్న మంత్రి ప్రణబ్ ముఖర్జీ