ఇరాక్ పునర్నిర్మాణ ప్రక్రియలకు ది యునైటడ్ డెవలప్‌మెంట్ ప్రొగ్రామ్ (యూఎన్‌డీపీ) మరియు జపాన్ బ్యాంక్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ (జేబీఐసీ) రుణాలను అందజేయనున్నాయి. దీనికోసం ఇరు బ్యాంక్‌లు సంయుక్తంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రకారం ఇరు బ్యాంకులు రుణాలను లోన్ల ద్వారా అందజేస్తాయని బ్యాంకు వర్గాలు పేర్కొన్నాయి.
ఈ రుణాలతో ఇరాక్ విద్యుత్ సదుపాయాలను ఇరాక్ ఈశాన్య ప్రాంతంలో ఏర్పాటు చేయనుందని ఇరాక్‌కు చెందిన ఓ ఏజెన్సీ వివరాలు తెలిపాయి. ఈ ఒప్పందంతో 150 మిలియన్ డాలర్ల విలువగల రుణాన్ని ఇరాక్ పొందుతుందని యూఎన్‌డీపీ తెలిపింది. దీనికోసం 3.5 మిలియన్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ వివరాలు వెల్లడించాయి.
|